MLA Laxma Reddy: రేపే జడ్చర్లలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ.. ఏర్పాట్లు పరిశీలించిన లక్ష్మారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Laxma Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. వరుసగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.. ఈ రోజు సిరిసిల్ల, సిద్దిపేటలో జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్.. రేపు జడ్చర్ల రాబోతున్నారు.. రేపు మధ్యాహ్నం జడ్చర్లలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లలో మునిగిపోయారు గులాబీ పార్టీ శ్రేణులు.. ఇక, సీఎం కేసీఆర్ బహిరంగసభ ఏర్పాట్లను మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తో కలసి పరిశీలించారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. ఉమ్మడి జిల్లాలో నిర్వహించే మొదటి బహిరంగ సభ కానుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: Anil Kumar Yadav: మగాళ్లయితే నేరుగా రండి.. ఆడాళ్లపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కాదు..!
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
సభా ప్రాంగణంలో ఏర్పాట్లతో పాటు.. సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో రానుండడంతో.. ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు.. సభకు ఎంత మంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఫోకస్ పెట్టారు. రేపటి భారీ బహిరంగసభలో పార్టీ శ్రేణులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఓవైపు సభ ఏర్పాట్లను చూస్తూనే.. మరోవైపు ప్రచారంపై దృష్టి సారించారు లక్ష్మారెడ్డి.. వివిధ పార్టీలకు చెందినవారిని పార్టీలోకి ఆహ్వానిస్తూనే ఉన్నారు.. నేడు జడ్చర్ల పట్టణం లారీ డ్రైవర్లు అసోసియేషన్ సంఘం నుండి 40 మందికి పైగా సభ్యులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.. వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.





తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?