నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నాము అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. డాక్టర్లు వారి ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నరు.. ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడింది.. ఇన్ఫెక్షన్ తగ్గడం కోసం ఐసీయూలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది.. ఇంత ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. కోడికత్తి అని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడు.. దివాలకోరు రాజకీయాలు చేస్తున్నారు.. పోలీసులు విచారణ సాగుతోంది.. తని ఫోన్ కాల్స్ ట్రేస్ చేస్తున్నారు.. రాజకీయంగా కొట్లాడాలి.. గాని ఇలా చిల్లర హత్య రాజకీయాలు చేయకూడదు అంటూ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
Read Also: Shaheen Shah Afridi: పాక్ ఫాస్ట్ బౌలర్ సరికొత్త రికార్డు.. వన్డే చరిత్రలోనే..!
ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం.. పదేళ్లు అధికారంలో ఉన్నాము కానీ ఎక్కడ ఎప్పుడు ఇటువంటి రాజకీయాలు చేయలేదు.. పగ ప్రతీకారాలు.. లేని రాజకీయం చెయ్యలేదు.. ఎన్ని కేసులు ఉండేవి…ఇప్పటివరకు.. పని నీ నమ్ముకుని మేము ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేశాము.. తెలంగాణ ప్రజలు ఇటువంటి చర్యలను ఒప్పుకోరు.. పెద్దగా ఇటువంటి హర్షించరు.. ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి భద్రత కూడా పెంచాలని కోరుతూన్నాము అని ఆయన అన్నారు.