తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 16 అభ్యర్థులతో మూడో జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. నామినేషన్లు మరో ఐదు రోజుల్లో ముగియనున్నాయి. టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్న స్థానాలను ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రకటించింది.
ఓటర్లను ఆకట్టుకునేందుకు లీడర్లు అనేక పాట్లు పడుతున్నారు. హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలని బూత్ కమిటీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో గోల్ఫ్పై శ్రీనిధి యూనివర్సిటీ తమ నిబద్ధతను చాటుకుంది. హైదరాబాద్ లో తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మూడో ఎడిషన్ విజయవంతంగా ముగిసింది. ఈ పోటీలో 16 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్ సీజన్ 3లో K మోటార్స్ - ఆర్య వారియర్స్ విజయం సాధించింది.
తెలంగాణలో చీటింగ్.. కరప్షన్ ప్రభుత్వం ఉందని సీబ్ల్యూసీ సభ్యులు పవన్ ఖేరా విమర్శలు గుప్పించారు. యువతని మోసం చేసింది.. తెలంగాణ నిరుద్యోగంలో 15 శాతం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mukesh Ambani: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి ఇటీవల బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఈ కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ముకేష్ అంబానీ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ.. ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ కేసును విచారించిని గాందేవి పోలీసులు తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడిని ముంబైలో శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. నిందితుడిని గణేస్ రమేష్ వనపర్థిగా గుర్తించారు. అతడిని నవంబర్ 8వ తేదీ వరకు పోలీస్…