ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్కు వచ్చి వెళ్లారని.. ఐఐఎం మెడికల్ కాలేజ్లు ఉన్నత విద్యా సంస్థలు విభజన హామీలు ఏవీ అమలు చేయని పార్టీ బీజేపీ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపు అంశం అన్నీ పార్టీల్లోనూ అగ్గి రాజేసింది. ఇక కాంగ్రెస్లో మూడు జాబితా నేతల్లో ఉన్న అసంతృప్తిని బయటపెట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, పటాన్చెరులలో సీట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు.
జడ్చర్ల మున్సిపాలిటీలోని పాతబజార్ 13వ వార్డు, 22వ వార్డుల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే తమకు తాగునీటి కష్టాలు తీరాయని ఈ సందర్భంగా వార్డులో మహిళలు ఎమ్మెల్యేకు వివరించారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంథనిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో రాజకీయ పరిణతి పెరగాలి.. ప్రజస్వామ్య పరిణతి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు సీఎం అవుతానని ఆయన అన్నారు. కానీ నాకు సీఎం కావాలని లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని మందమర్రిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ గడ్డ చైతన్య వంతమైనదని, ఓటు విచక్షణతో వేయాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా కాటరాక్ట్ ఆపరేషన్ను నిర్వహించారు. చంద్రబాబుకు 45 నిమిషాల్లో కాటరాక్ట్ ఆపరేషన్ను వైద్యులు పూర్తి చేశారు.
శ్రీశైలంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏపీ గురించి మాట్లాడేటప్పుడు ముందు హైదరాబాద్ లో నాలాల్లో పిల్లలు కొట్టుకుపోతున్నారు అది చూడండి అని సెటైర్ వేశారు.