వరంగల్ జిల్లా ఖిలావరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వర్ రావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని ఆయన ఇంటిపై వరంగల్ ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు. తహసిల్దార్ నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మంలో సైతం ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. బండి నాగేశ్వర్ రావు గతంలో ధర్మసాగర్, కాజీపేట, హసన్ పర్తి మండలాల్లో తహసిల్దారుగా పనిచేశారు. ఆ సమయంలో ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది.…
తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. భారీ వరదల కారణంగా రోడ్లు ధ్వంసం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతారంయ ఏర్పడింది. ఇక ఇప్పుడు నార్సింగి ఔటర్ సర్వీస్ రోడ్డు, ఔటర్ ఎంట్రీ, ఎగ్జిట్ మూసివేశారు అధికారులు. ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తి 3000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు అధికారులు. దీంతో మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తోంది. మంచిరేవుల బ్రిడ్జి పైనుంచి మూసీ నది…
తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగించింది కేంద్రం. మరో ఏడు నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2026 మార్చి నెల వరకు పదవీ కాలం పొడిగించింది. ఈ నెల 31న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సర్వీసు పొడిగించాలని డివోపిటిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మరో 7 నెలలు సర్వీసు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఏఐఎస్ (సీఎస్–ఆర్ఎం)…
* నేడు జపాన్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. సెమీ కండక్టర్లతో ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్న మోడీ * నేడు ఉదయం 8.30 గంటల వరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ, కొత్తగూడెం జిల్లాల్లో…
కామారెడ్డిలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో చోటుచేసుకున్న వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. బీబీపేట పెద్ద చెరువు ప్రమాదకరంగా మారింది. చెరువుకు బుంగ పడటం తో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా బీబీపేట దిగువన ఉన్న షేర్ బీవీపేట గ్రామస్తులను ఖాళీ చేయించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు మరో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది విద్యా శాఖ. Also Read: Telangana Flood Rescue : తెలంగాణలో ఇవాళ 1,444…
దేశ వ్యాప్తంగా కొలువుదీరిన గణేషుడు భక్తుల నుంచి పూజలందుకుంటున్నాడు. పూజలు, భజనలతో గణపయ్య భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా కొందరు మూడో రోజు నుంచే నిమజ్జనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం అని తెలిపారు. ఈ ఏడాది నిమజ్జనానికి 30 వేల మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 20 వేల మంది హైదరాబాద్…
మెదక్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి (మం) పోతారెడ్డిపేట పెద్ద చెరువు వాగులో ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. పొలం పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా వాగు ఉదృతిలో చిక్కుకుపోయారు. రాత్రంతా రైతులు గోపాల్, సుదర్శన్, రాజు వాగులోనే ఉన్నారు. తమను రక్షించాలని అధికారులను వేడుకున్నారు. కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. ముగ్గురు రైతులని రక్షించేందుకు రంగంలోకి SDRF టీం దిగింది. పోతారెడ్డిపేట వాగులో చిక్కుకున్న రైతులను బోటులో వెళ్లి…