హైదరాబాద్‌ను బీజేపీ కంచుకోటగా మలచామని, GHMC ఎన్నికల్లో 48 సీట్లు గెలిచిన విషయమే దీనికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి మంచి ఓటు షేర్ రావడం ప్రజలు ప్రత్యామ్నాయంగా కేవలం బీజేపీనే భావిస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “విద్యార్థి దశ నుంచే గోపినాథ్ చురుకుగా ఉండేవారు.. 1983లో తెలుగుదేశం పార్టీలో గోపీనాథ్ తన రాజకీయ ప్రస్థానాన్ని గోపీనాథ్ ప్రారంభించారు..1985 నుంచి 1992 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారు.. 1987-88 లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా, 1988-93 లో…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. మొదటి రోజు తమ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ సంతాప తీర్మానంపై చర్చకు సైతం దూరంగా ఉంటున్న కేసీఆర్.. కేటీఆర్ నాయకత్వంలో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సభలో అనుసరించాల్సిన వ్యూహ్యంపై కేటీఆర్, హరీష్ కు దిశానిర్దేశం చేసిన కేసీఆర్.. నిన్న కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు సుదీర్ఘ మంతనాలు.. Also Read:Hyderabad Crime: కూకట్పల్లి హౌసింగ్…
తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ శాఖకు కొత్త డైరెక్టర్ జనరల్‌గా విక్రమ్ సింగ్ మాన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 31తో పదవీ విరమణ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ లో జరిగిన సమావేశంలో జీఎస్టీ రేషనలైజేషన్ (GST Rationalisation) అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి ఎనిమిది రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. ఇందులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు భారీ రెవెన్యూ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మెదక్ జిల్లాలో ఆర్మీ జవాన్లకి పెను ప్రమాదం తప్పింది. రెస్క్యూ కోసం ట్రయల్ వేస్తుండగా బోటు బోల్తా పడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది జవాన్లను రక్షించేందుకు రంగంలోకి దిగారు. తాళ్ల సాయంతో జవాన్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కాగా ఈ నెల 27న వినాయకుని విగ్రహం కొనుగోలు చేసేందుకు కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామానికి చెందిన 8 మంది చిన్నారులు మెదక్ కు వచ్చారు. భారీగా కురిసిన వర్షాలతో పోచారం వరద ఎక్కువ కావడంతో మూడు రోజులుగా…