హైదరాబాద్లో గణేష్ నిమజ్జన ఘట్టం ప్రారంభమైంది. నగరంలో గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ట్యాంక్బండ్కు బొజ్జ గణపయ్యలు తరలివస్తున్నాయి. ఇక ఇప్పుడు అందరి చూపు ఖైరతాబాద్ గణేషుడి వైపే ఉంది. కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది. ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్న నిమజ్జనం ఏర్పాట్లు.. కొనసాగుతున్న వెల్డింగ్ పనులు.. Also Read:Murder Case : గోల్డ్ వ్యాపారీ మిస్టరీ హత్య.. ఈ ఏడాది 69…
నగర పోలీస్ కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ రేపు జరగబోయే గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. “పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశాము.. 40 గంటల పాటు నిమజ్జనం సాగబోతుంది.. రేపు ఒక్క ట్యాంక్ బండ్ లోనే 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయి.. నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశాము.. నిన్న కూడా ఛత్రినాకలో ఒక ఘటన జరిగింది.. విగ్రహం ఎత్తు ఉండటం వల్ల కరెంట్ వైర్ కు తగలకుండా…
గణేశ్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా మెట్రో రాకపోకల సమయాల్లో మార్పులు చేసింది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. లాస్ట్ ట్రైన్ మధ్యరాత్రి 1 గంట వరకు నడపనున్నట్లు వెల్లడించింది. 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై 7 వ తేదీ మధ్యరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు కొనసాగనున్నాయి. గణపయ్య భక్తులకు ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఖైరతాబాద్ మహా గణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో సీఎం రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు అర్చకులు.. సీఎం రేవంత్ ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల సందర్బంగా ప్రజలందరికి శుభాకాంక్షలు.. దేశంలోనే గణేష్ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.. ఖైరతాబాద్ గణేశుని కి ప్రత్యేకత ప్రాధాన్యత ఉంది.. 1 లక్ష నలభై వేల విగ్రహాలు ఈ సారి నగరంలో ప్రతిష్టించారు..…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. రామాలయం సమీపంలోని ప్రైవేట్ లాడ్జిలో పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లాడ్జి సిబ్బంది వారిని వెంటనే భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి యువకుడు మృతిచెందాడు. యువతీ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. మృతుడు వెస్ట్ గోదావరి జిల్లా కి చెందిన నడిపింటి రవి(35)గా గుర్తించారు. చికిత్స పొందుతున్న యువతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం…