జీవో-3 పై కవిత మహిళాలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్- 1 నోటిఫికేషన్ పై ఇచ్చిన మెమో మీరు ఇచ్చారు.. ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేని మీరు.. ఇప్పుడు మట్లాడుతున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతోంది. బయటికి వెళ్లాలంటే భయం పుట్టిస్తున్నాడు భానుడు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్లో ఎలా ఉంటుందోనని భయం వేస్తోంది. ప్రస్తుతం అన్ని కాలాలు ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి. పోయిన ఏడాది చలికాలంలోనూ ఎండలు దంచికొట్టాయి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోడీకి ఎయిర్ పోర్టులో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
ప్రధాని మోడీ రాకతో మార్పులు చేశారు. దాదాపు 50 నిమిషాలు ఆలస్యంగా ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. 7:50 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉండగా.. ఆలస్యం కారణంగా రాత్రి 8:40 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.
అదానీ, అంబానీ ఆస్తిని కూడా సగటు భారత పౌరునితో పోల్చితే ఎలా..? అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అట్లా చూసి సగటు పౌరుని జీవన ప్రమాణాలు పెరిగాయని ఎట్లా అంటారు అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదు అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి వారం ఎదో ఒక నియామక పత్రాలు ఇస్తున్నాం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. ఉద్యమ స్ఫూర్తీతో పని చేయాల్సిన నాటి ప్రభుత్వం గాలికి వదిలేసింది అని విమర్శించారు. కల్వకుంట్ల ఉద్యోగాలు ఊడగొట్టిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.