జూన్ 8 లేదా 9న మూడో సారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. దేశం కోసం ఓటెయ్యండి.. అభివృద్ధి కోసం ఓటెయ్యండి అంటూ ప్రజలకు ఆయన సూచించారు. భారత దేశ గౌరవాన్ని పెంచడం కోసం ఓటెయ్యాలన్నారు. మోడీ ప్రధాని అయ్యేవరకు దేశం ఎలా ఉండేది.? ఆలోచించాలన్నారు.
వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆమె వద్దనే 2.5 లక్షల అప్పు తీసుకున్న ఓ వ్యక్తి.. అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27 మహిళా అదృశ్యం కేసు నమోదు కాగా.. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. ఎట్టకేలకు నిందితుడు తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.