తెలంగాణలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా ముగిశాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తలేదన్నారు. మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా వచ్చారని పేర్కొన్నారు. అయితే మెదక్ జిల్లా కొల్చారం (మం) సంగాయిపేట తండాలో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఏకంగా వంద శాతం పోలింగ్ నమోదైంది. తండాలో మొత్తం 210 మంది ఓటర్లు ఉండగా… తండా వాసులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వంద శాతం పోలింగ్ నమోదు కావడంతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అభినందించారు.
ఇది కూడా చదవండి: KKR vs GT: కోల్కతా-గుజరాత్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు..
తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైందని.. అత్యధికంగా మెదక్‌లో 71.33 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.17 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. కేంద్ర ఆధ్వర్యంలో ఉండే యాప్‌లలో 415 ఫిర్యాదులు రాగా.. వేర్వేరు ప్రాంతాల్లో 38 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు. 225 ఫిర్యాదులు సీ విజిల్ యాప్ ద్వారా వచ్చాయన్నారు. భారీ బందోబస్తుతో స్ట్రాంగ్‌రూమ్స్‌లో ఈవీఎంలను భద్రపరిచినట్లు సీఈవో చెప్పారు.
ఇది కూడా చదవండి: Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా కనిపిస్తోంది.. అంతిమ విజయం ప్రజలదే..