జగిత్యాల జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం తీసేస్తామంటుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జగిత్యాలలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బీజేపీ నిర్వహించిన సభలో హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్ నినాదాలతో ప్రజల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో ఓటు షేర్ పెరిగిందని.. 10 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థలో స్థానంలో నిలపడమే ఎన్డీఏ లక్ష్యమని అన్నారు. సీఎంగా,…
ఈనెల 9వ తేదీ లోపు రైతు భరోసా డబ్బులు పూర్తిగా అకౌంట్స్ లో పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఇక, రైతు రుణమాఫీపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేశాం.. కేసీఆర్ ఆరు గ్యారంటీలు అమలు కాలేదు అంటున్నాడు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
పార్లమెంట్లో ప్రజల గొంతుకగా నిలిచేందుకే తనకు మద్దతు తెలపాలని.. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఇతర నేతలతో కలిసి రాంగోపాల్ పేట్, నల్లగుట్ట, కాచిబౌలి, గైదన్ భాగ్ బస్తీలలో పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు.
మోడీ పని రాక్షసుడు.. ఆయన నిద్రపోరు.. మమ్మల్ని నిద్రపోనివ్వరు అంటూ ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మోడీ లాంటి వ్యక్తి దేశానికి అవసరమైన నాయకుడు.. సెలవు ఉంది కదా అని ఓటెయ్యకుండా ఉండకండి.. ఓటేసి సెలవు తీసుకోండి అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
మన తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలంలో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా లేని విధంగా ఈసారి వేసవి తాపం అత్యధికంగా ఉంది. ఈ దెబ్బతో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 8 గంటల అయితే చాలు అప్పటి నుండే 40 డిగ్రీల పైన ఎండ కొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో అయితే 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇంటి నుంచి…