తెలంగాణ కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షరతులు విధించింది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని సీఈసీ షరతులు విధించింది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమవుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత వాతావరణశాఖ ఓ కీలక అప్డేట్ ను వెల్లడించింది. బంగాళాఖాతానికి ఈశాన్యాన ఉన్న అండమాన్, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపనాలు మొదటగా తాకుతాయి. ప్రతియేటా మే 18 – 20 తేదీల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని, ఇప్పుడు కూడా ఆ సమయానికి తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని స్పష్టం అవుతుంది. PM Modi: అవినీతికి అమ్మ కాంగ్రెస్… అభివృద్ధిని పట్టించుకోని…
Triple Talaq Case: 2019లో ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైనట్లు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
Dharani Special Drive: ధరణి సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్నం 12:30కి సచివాలయంలో ధరణి కమిటి సమావేశం కానుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై కమిటీ సమీక్షించనుంది.
BJP For Farmers: కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో రైతుల సమస్యలపై బీజేపీ రణభేరీ మోగించింది. 6 హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నిర్ణయించింది.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై టీఎస్పీఎస్సీ తాజాగా అప్డేట్ ఇచ్చింది.
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఇక మరికొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న వెల్లడించారు.