వివిధ రంగాల్లో స్థిరపడిన కమ్మ సామాజిక వర్గాన్ని ఒకే వేదికపైకి చేర్చి సేవా కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థే 'కమ్మ గ్లోబల్ ఫెడరేషన్'(కేజీఎఫ్). కమ్మ గ్లోబల్ ఫెడరేషన్'. ఈ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 20, 21 తేదీల్లో హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రపంచ కమ్మ మహాసభలు జరగనున్నాయి.
సచివాలయంలో గ్రూప్ -2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ చివరి వారంలో నిర్వహణకు సాధ్యాసాధ్యులపై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరి వారానికి గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి డిప్యూటీ సీఎం అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించామని ఆయన…
కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తాం... చేసి చూపెడతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రుల బృందం పర్యటిస్తోంది. అందులో భాగంగా.. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయని పేర్కొన్నారు. 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేసే బాధ్యత తమదని అన్నారు. 7 నెలల నుంచి ప్రతిపక్షాలు ప్రతి పనికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఫ్రీ బస్సు, ఆరోగ్య శ్రీని విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.