నేడు విశాఖలోని అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు.. ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటన మృతుల కుటుంబాలు.. గాయపడ్డవారిని పరామర్శించనున్న సీఎం చంద్రబాబు..
నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ హైకమాండ్ తో భేటీకానున్న సీఎం రేవంత్.. నామినేట్ పదవులు, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై చర్చ.. రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణకు హాజరుకావాలని.. సోనియా, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్న సీఎం రేవంత్..
నేడు తెలంగాణ వ్యాప్తంగా ధార్నాలకు బీఆర్ఎస్ పిలుపు.. షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్..
నేడు యాదగిరిగుట్టకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు.. రైతు రుణమాఫీపై సీఎం మాట తప్పారు.. యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామిపై ఒట్టు పెట్టి.. రేవంత్ మాట తప్పినందుకు పాప పరిహారం చేయాలని హరీశ్ రావు మండిపాటు.
నేడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ..
నేడు పోలెండ్ లో కొనసాగుతున్న ప్రధాని మోడీ పర్యటన.. రాత్రికి పోలెండ్ నుంచి ఉక్రెయిన్ కి వెళ్లనున్న నరేంద్ర మోడీ..
నేడు రెండో రోజు జమ్ముకశ్మీర్ లో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీల పర్యటన..
నేడు దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ నిరసన.. అమరవీరుల స్థూపం నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ ర్యాలీ.. ఆదానీ కృత్రిమంగా కంపెనీ షేర్లు బదలాయింపు జరిగిందన్న సెబీ ఆరోపణలు.