Man Kills Wife and Daughter in Bowenpally: సికింద్రాబాద్ బోయిన్పల్లిలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్య, 10 నెలల కన్న బిడ్డను ఓ వ్యక్తి చంపాడు. ఆపై అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు భావిస్తున్నారు. మహారాష్ట్ర నాంథేడ్కు చెందిన గణేశ్,…
Flood Effect: గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా వరద ప్రవాహాం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కుంట దగ్గర జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తింది. ఈ వరద దెబ్బకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా, హౌసింగ్ శాఖ స్పెషల్ సీఎస్ గా వికాస్రాజ్ను నియమించారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్ దత్.. ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ కొర్రా లక్ష్మి.. రెవెన్యూ స్పెషల్ సెక్రటరీగా హరీష్.. మేడ్చల్ మల్కాజ్గిరి అదనపు కలెక్టర్గా రాధికాగుప్తా బాధ్యతలు చేపట్టనున్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషాలిటీ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా.. పేద, మధ్యతరగతి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, పోలీసు సిబ్బందికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నగదు…