కేంద్రబడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ఏపీ వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడారని, తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా అంటూ ప్రశ్నించారు.
Mystery of Death: హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ లో ముగ్గురు మృతుల మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, తల్లి, కుమారుడు బాత్రూంలో మృతి చెంది కనిపించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో మొదటిసారి అసెంబ్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత, ఫాంహౌస్ కే పరిమితమైన కేసీఆర్.. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం. ఈనెల 24వ తేదీన (బుధవారం) తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆ రోజు కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు.