MLC Kavitha: ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా కవిత తన తండ్రిని కలిశారు. కవిత తన భర్త, కుమారుడితో కలిసి ఈరోజు మధ్యాహ్నం ఎర్రవెల్లి నివాసానికి వెళ్లారు.
ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా.. దేశ వ్యాప్తంగా మొత్తం 12 గ్రీన్ సిటీస్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అందులో ఏపీకి రెండు.. తెలంగాణకు ఒక “పారిశ్రామిక స్మార్ట్ సిటీ” కేటాయించింది.
దేశవ్యాప్తంగా 234 నగరాల్లో కొత్తగా ఎఫ్.ఎమ్ రేడియో సౌకర్యం కల్పించనుంది. అందులో భాగంగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మరిన్ని ఎఫ్.ఎమ్ రేడియో కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.