తెలంగాణ గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వివిధ గురుకుల విద్యాలయాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రోవిజినల్(తాత్కాలిక) జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.
వైస్ ఛాన్స్లర్స్ లేకుండా తెలంగాణలో విశ్వవిద్యాలయాలు ఇంకెన్నాళ్ళు అలా ఉండాలి? నియామకం విషయంలో ప్రభుత్వానికి సీరియస్‌నెస్ లేదా? పది వర్శిటీలకు పాలక మండళ్ళు లేకుంటే...ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నట్టు? విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామన్న మాట నిలబెట్టుకునేది ఇలాగేనా? వీసీల ఎంపికలో ప్రభుత్వానికి అడ్డుపడుతున్నదేంటి? సీరియస్ ఎపిసోడ్‌ని లైట్ తీసుకుంటున్నారన్న విమర్శల్లో నిజమెంత?
రాఖీ ఆపరేషన్స్, మెరుగైన పనితీరుపై తమ క్షేత్రస్థాయి అధికారులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రత్యేకంగా సమావేశమైంది. హైదరాబాద్ బస్ భవన్ నుంచి వర్చ్‌వల్‌గా బుధవారం జరిగిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు.
మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. భార్య చేతిలో భర్త హత్యకు గురయ్యాడు. కుటుంబ కలహాలతో భార్య హత్య చేసినట్లు గుర్తింపు. పోలీసుల కథనం ప్రకారం.. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవవి. అస్సాంకు చెందిన రుక్సానా(35) భర్తతో కలిసి హఫీజ్ పేట్ ప్రేమ్ నగర్ లో నివాసం ఉండేవారు.