Child Files Complaint: “మా నాన్న ఎప్పుడూ కొడుతున్నాడు..నాకు నాన్న వద్ద.. నేను హాస్టల్‌లోనే ఉంటా..” అంటూ ఓ పన్నెండేళ్ల బాలిక సోమవారం జగిత్యాల పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో వెక్కి వెక్కి ఏడుస్తూ ఓ పన్నెండేళ్ల బాలిక తన గోడును వెళ్లబోసుకుంది. అసలేం జరిగిందంటే.. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లెకు చెందిన బాలిక తల్లి గతంలో చనిపోయింది. దీంతో ఆ బాలిక తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. అనారోగ్యంతో తల్లి మృతి తో తట్టుకోలేని దీనస్థితిలో బాలిక ఉండగా.. తల్లి లోటును చిన్నమ్మ తీర్చలేదు.. తండ్రి ఆదరించలేదు. ఏడో తరగతి చదువుతున్న బాలికకు గతంలో బాలసదనం, ఆనంద నిలయంలో ఆశ్రయం కల్పించినా ఉండలేదు.
Read Also: Road Accidents: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది దుర్మరణం
అనంతరం కేజీబీవీలో ఆశ్రయం కల్పించగా, తల్లిని తలచుకుంటూ అక్కడ ఇమడ లేక ఇంటికి చేరింది. అయితే తండ్రి కొడుతుండడంతో 5 రోజుల కింద ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంటి నుంచి వెళ్లిన బాలికను వేములవాడలో గుర్తించి సిరిసిల్ల సఖీ కేంద్రంలో చేర్చి డీసీపీవో ఆఫీసర్లు తండ్రికి అప్పగించారు. అయితే సఖీ కేంద్రం నుంచి రాగానే తండ్రి మళ్లీ కొట్టడంతో చుట్టుపక్కల వారు గమనించి ఆపారు. ఈక్రమంలోనే తండ్రి కొడుతున్నాడని ఇంట్లో ఉండలేనంటూ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాలిక.. పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుంది తల్లి ప్రేమకు నోచుకోని బాలిక ఆవేదన విని పోలీసులు చలించిపోయారు. పట్టణ సీఐ వేణు సమాచారంతో సదరు బాలికను జగిత్యాల డీసీపీవో సిబ్బంది సఖీ కేంద్రానికి తరలించారు.