ఎర్రన్నల మధ్య ఏకాభిప్రాయం లేదా? సీపీఐ కేంద్ర కమిటీకి, తెలంగాణ కమిటీకి మధ్య సమన్వయ లోపం ఉందా? ఒక కార్యక్రమం విషయంలో పరస్పరం మాట్లాడుకోకుండా… ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారా? ఆయనో రకం, ఈయనో రకం అన్నట్టు రెండు కమిటీల్లోని ముఖ్యులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎందుకు వ్యవహరిస్తున్నారు? తెలంగాణ సీపీఐలో అసలేం జరుగుతోంది? హైదరాబాద్‌లో ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. అలాగే… అంతకు ముందు రోజు.. ప్రొఫెసర్ సాయిబాబా…
ఈ ప్రాజెక్ట్ మన దేశానికి అత్యంత ఉపయోగకరమైనదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. నేడు అబ్దుల్ కలాం జయంతి ఈ రోజు శంకుస్థాపన పనులు ప్రారంభించడం హర్షణీయమని ఆయన అన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వు ఫారెస్ట్‌లో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో రక్షణ మంత్రి మాట్లాడారు.
Telangana: రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు యాజమాన్యాలు తాళాలు వేశారు. 9 నెలలుగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ భవనాల యజమానులు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టళ్లకు తాళాలు వేశారు.
దీపావళి పండుగను ఏ తేదీన జరుపుకోవాలనే విషయంపై పంచాంగ కర్తల మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. దీపావళి అక్టోబర్ 31వ తేదీన కాదు.. నవంబర్ 1న జరుపుకోవాలని కోనసీమ ధృక్ సిద్ధాంత పంచాంగ కర్తలు గణన చేస్తుండగా.. లేదు లేదు.. అక్టోబర్ 31వ తేదీనే జరుపుకోవాలని రేలంగి తంగిరాల పంచాంగ కర్తలు పేర్కొంటున్నారు.
తెలంగాణలో గ్రూప్-1కు పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు.. ఈ నెల 21 నుంచి యథావిధిగా గ్రూప్-1 మెయిన్స్
Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రెండు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది కేంద్రం.. అందులో ఆంధ్రప్రదేశ్‌కు 498 కోట్ల రూపాయలు కేటాయించగా.. తెలంగాణకి 516 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.