హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నగరంలో వాన దంచికొడుతుంది. అబిడ్స్, కోఠి, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.
హైదరాబాద్ శివారులో యువకులు రెచ్చిపోయారు. కొందరు యువకులు గన్‌తో హల్చల్ చేసిన ఘటన బాచుపల్లి స్పోర్ట్స్ క్లబ్ వద్ద చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ తుపాకీ గురిపెట్టి యువకులు వీరంగం సృష్టించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు నేడు భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు సీఎంతో చర్చ కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఇండస్ట్రీలోని సమస్యలతో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి సినీ ప్రముఖులు వివరించనున్నారు. అలాగే, నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డుల పరిశీలన.. చిన్న, మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు లాంటి విషయాలు…
తెలుగు దేశం పార్టీకి చెందిన రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఒకేచోటికి వచ్చే విధంగా చేసింది ఓ పాత కేసు.. విజయవాడ కోర్టుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ మాజీ నేతలు హాజరయ్యారు.. టీడీపీకి చెందిన పాత నేతల అంతా ఒకేచోట కనిపించడంతో సందడి కనిపించింది.
Christmas Celebrations: తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల్లో చర్చిలు వెలిగిపోతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలతో చర్చిలు కిటకిటలాడుతున్నాయి.
అల్లు అర్జున్ ఎపిసోడ్లో పార్టీ నాయకులు.. గప్‌చుప్‌గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్ వరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పుష్ప సినిమా వ్యవహారంలో ప్రభుత్వం.. పోలీసులు చూసుకుంటారని దానిపై రాజకీయ నాయకుల కామెంట్స్ అవసరం లేదని హెచ్చరించారు. అనవసరంగా నాయకులు ఎదురుదాడి చేస్తే తలనొప్పి వస్తుందని ముందే గ్రహించిన సీఎం రేవంత్‌రెడ్డి...పార్టీ నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు.
Formula-Car Race Case: ఫార్ములా-ఈ రేసు కేసులో కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏసీబీ అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు అందాయి. ఈ ఫార్ములా కేసులో ఫిర్యాదుదారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేశారు.