Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Headlines Top Headlines 9 Am 29th January 2025

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Published Date :January 29, 2025 , 9:04 am
By Sudhakar Ravula
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహిళా తహసీల్దార్‌కు బెదిరింపు కాల్స్‌.. మేం వస్తున్నాం.. బయటకు రండి..!
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండల తహసీల్దారు శ్రావణికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్‌ రావడం కలకలం రేగింది. కార్యాలయంలో మంగళవారం విధులు నిర్వర్తిస్తుండగా ఆమె మొబైల్ ఫోన్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎక్కడున్నారు.? ఏమి చేస్తున్నారు..? విధుల్లో ఉన్నారా..? మేము కార్యాలయం వద్దకు వస్తున్నాం.. బయటకు రండి అంటూ బెదిరించేలా మాట్లాడారు గుర్తుతెలియని వ్యక్తులు.. దీంతో ఆందోళనకు గురైన ఆమె.. ఈ విషయాన్ని కలెక్టర్ చామకూరి శ్రీధర్ కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు ఫోన్ చేసి తహసిల్దార్ కు వచ్చిన బెదిరింపు కాల్స్ పై విచారణ చేపట్టాలని కోరారు. ఎస్పీ ఆదేశాలతో రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్ ఆన్ లైన్ లో నంబర్‌ను పరిశీలించగా బెంగుళూరు నుంచి కాల్ వచ్చినట్లు గుర్తించారు. ఫేక్ కాల్ గా భావిస్తున్నామని, ఆ ఫోన్ నెంబర్ పై ఆరా తీస్తున్నామని సీఐ వరప్రసాద్ తెలిపారు. అయితే, ఈ బెదిరింపు కాల్స్‌ వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు..

జైలు నుంచి నందిగం సురేష్ విడుదల.. 145 రోజుల తర్వాత..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు నుండి విడుదలయ్యారు… పలు కేసుల్లో, 145 రోజులుగా జైలులో ఉంటున్న నందిగం సురేష్ కు వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈ రోజు ఉదయం జైలు నుండి విడుదలయ్యారు… పదివేల రూపాయల పూచికత్తు సమర్పించిన నందిగం సురేష్ ని జైలు అధికారులు విడుదల చేశారు.. ప్రస్తుతం నందిగం సురేష్ కాలర్ బోన్ నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో సురేష్ ను చికిత్స కోసం విజయవాడ తరలించారు ఆయన బంధువులు.. కాగా, మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం విదితమే.. రూ.10 వేల పూచీకత్తుతో మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు. అయితే, నిన్న షూరిటీలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో ఇవాళ ఉదయం సురేష్‌ను విడుదల చేశారు.. అయితే, మహిళ హత్య కేసులో గతేడాది అక్టోబర్ 7వ తేదీన నందిగం సురేష్‌ను అరెస్ట్‌ చేయగా.. దాదాపు 145 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల అయ్యారు.

నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు (జనవరి 29) కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో కసరత్తు చేస్తున్నారు. నేటి ఉదయం 11 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ తదితరులు పాల్గొననున్నారు. కాగా, సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ఫిబ్రవరి 1వ తేదీ నాటికి సంవత్సరం అవుతుంది. పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తర్జన భర్జన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వేచి చూస్తుంది. ఇప్పటికే కమిషన్ రిపోర్టును రెడీ చేశాగా.. ఈ రోజు జరిగే సమావేశంలో నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రిజర్వేషన్లపై సీఎం రేవంత్ సర్కార్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్ ఉంది. రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈరోజు జరిగే భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

చరిత్ర సృష్టించిన ఇస్రో.. 100వ మిషన్ విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన అంతరిక్ష ప్రయోగాలలో మరో చరిత్రను సృష్టించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగంలోజీఎస్ఎల్వీ-ఎఫ్15 (GSLV-F15)రాకెట్ ద్వారా నూతన నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-02 (NVS-02) ను కక్ష్యలో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్వీఎస్-02 ఉపగ్రహం భారతీయ ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ (నావిక్) విస్తరణలో కీలక పాత్ర పోషించనుంది. దీని మొత్తం బరువు 2,250 కిలోలు ఉండగా.. 10 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. ఉపగ్రహం జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశించడంతో భారత నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఇస్రో ఛైర్మన్‌గా నారాయణన్‌కు ఇదే తొలి ప్రయోగం కాగా, ఇది విజయవంతం కావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ ఈ ప్రయోగం ఇస్రో విజయయాత్రలో మరో గొప్ప ఘట్టమని తెలిపారు. శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ 1979 ఆగస్టు 10న నింగిలోకి ప్రయాణించగా, దాదాపు 46 ఏళ్ల తర్వాత 100వ ప్రయోగాన్ని చేపట్టి ఘనత సాధించింది. గత నాలుగు దశాబ్దాల్లో ఇస్రో అనేక కీలక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

16 రోజుల్లో 15 కోట్ల మంది పుణ్యస్నానాలు… నేడు మహా కుంభమేళాలో రికార్డు ఖాయం
మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటివరకు 16 రోజుల్లో దాదాపు 15 కోట్ల మంది గంగానదిలో స్నానమాచరించారు. ఇప్పుడు అందరి దృష్టి నేటి మౌని అమావాస్య స్నానంపైనే ఉంది. దీని కోసం భక్తులలో చాలా ఉత్సాహం ఉంది. ప్రభుత్వానికి, పరిపాలనకు అతిపెద్ద సవాలు ఏమిటంటే భక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈరోజు మౌని అమావాస్య. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళా రోజున, సంగమంలో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. దేశం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ఎక్కడ చూసినా జనసమూహం మాత్రమే కనిపిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే వారి సంఖ్య కూడా తక్కువ కాదు. రైలులో స్థలం లేదు. ప్రయాగ్‌రాజ్ టిక్కెట్లు నిండిపోయాయి. స్టేషన్‌లో ప్రయాణికుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. మంగళవారం నాడు దాదాపు 4 కోట్ల మంది భక్తులు గంగానదిలో స్నానమాచరించారని కూడా ఒక వాదన ఉంది. మహా కుంభమేళా సమయంలో ఇప్పటివరకు దాదాపు 15 కోట్ల మంది భక్తులు సంగమంలో స్నానమాచరించారని కూడా చెబుతున్నారు. ప్రతిరోజూ సగటున కోటి మంది మహా కుంభమేళాలో స్నానం చేస్తారని కూడా చెబుతున్నారు. మహా కుంభమేళాలో మొత్తం 45 కోట్ల మంది భక్తులు స్నానమాచరిస్తారని ప్రభుత్వం కూడా చెబుతోంది.

దక్షిణ కొరియాలో మంటల్లో చిక్కుకున్న విమానం.. 176మంది ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందంటే ?
దక్షిణ కొరియాలోని గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో ఒక ప్రయాణీకుల విమానం మంటల్లో చిక్కుకుంది. విమానం టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధమవుతుండగా ఈ మంటలు చెలరేగాయి. అంతకు ముందు విమానం వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. విమానంలో 176 మంది ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నారు. సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణీకులు, సిబ్బంది అందరినీ సురక్షితంగా తరలించారు. ఈ ఎయిర్ బుసాన్ విమానం A321 ఆగ్నేయ నగరమైన బుసాన్ నుండి హాంకాంగ్‌కు బయలుదేరడానికి సిద్ధమవుతోంది. విమానంలో మంటలు చెలరేగినట్లు సమాచారం బయటికి రాగానే 45 అగ్నిమాపక యంత్రాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఈ సంఘటన రాత్రి 10:30 గంటల ప్రాంతంలో జరిగింది. దాని వీడియో కూడా బయటకు వచ్చింది. దీనిలో విమానం, అగ్నిమాపక దళ వాహనాల వెనుక నుండి పొగలు వస్తున్నట్లు, విమానం చుట్టూ చాలా మంది ఉన్నట్లు చూడవచ్చు.

మా ఓటమికి కారణం అతడే: సూర్య
మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ ఓడిపోయింది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లను 145 పరుగులే చేసింది. హార్దిక్‌ పాండ్యా (40; 35 బంతుల్లో 1×4, 2×6) టాప్‌ స్కోరర్‌. జేమీ ఒవర్టన్‌ (3/24), బ్రైడన్‌ కార్స్‌ (2/28) దెబ్బకొట్టారు. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (51; 28 బంతుల్లో 7×4, 2×6) హాఫ్ సెంచరీ బాదాడు. వరుణ్‌ చక్రవర్తి (5/24) అద్భుత ప్రదర్శన చేశాడు. భారత్ ఓటమికి అదిల్ రషీద్ స్పెల్‌ కారణమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ‘మ్యాచ్‌కు మంచు ప్రభావం ఉంటుందని భావించా. హార్దిక్‌ పాండ్యా, అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నప్పుడు మ్యాచ్‌ గెలుస్తాం అనుకున్నాం. తిలక్ వర్మ దూకుడుగానే ఆడాడు. ఈ విజయం అదిల్ రషీద్‌కే దక్కుతుంది. అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కనీసం స్ట్రైక్‌ రొటేట్ కూడా చేయనీయలేదు. అందుకే రషీద్‌ ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్‌ అయ్యాడు’ అని చెప్పాడు. మూడో టీ20లో అడిల్‌ రషీద్‌ ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి.. ఓ వికెట్ పడగొట్టాడు. కీలక బ్యాటర్ తిలక్ వర్మ (18)ను క్లీన్‌ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

రోహిత్‌, యశస్వి, శ్రేయస్‌ లేకుండానే బరిలోకి జట్టు!
రంజీ ట్రోఫీలో ముంబై జట్టు రోహిత్‌ శర్మ లేకుండానే బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 6న ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌ కోసం రోహిత్ భారత జట్టుతో చేరాడు. దీంతో గురువారం మేఘాలయాతో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ గ్రూపు-ఎ మ్యాచ్‌లో ముంబై హిట్‌మ్యాన్ లేకుండానే ఆడనుంది. మరోవైపు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన యశస్వి జైస్వాల్, శ్రేయస్‌ అయ్యర్ కూడా ముంబై తరఫున బరిలో దిగడం లేదు. వీరి స్థానాల్లో ఆంగ్‌క్రిష్‌ రఘువంశి, సూర్యాంష్‌ షెడ్గే, అథర్వ అంకోలేకర్‌లను తీసుకున్నట్లు మంగళవారం ముంబై ప్రకటించింది. ఇటీవల భారత టెస్టు జట్టు ఘోర పరాభవాలు చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3-0తో వైట్‌వాష్‌, ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ రెండు సిరీస్‌లలో కెప్టెన్‌, బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ విఫలమయ్యాడు. దాంతో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాలంటూ రోహిత్‌కు మాజీ ‍క్రికెటర్లు సూచనలు చేశారు. ఈ విమర్శలపై స్పందించని హిట్‌మ్యాన్.. బీసీసీఐ ఆదేశాల మేరకు రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. సొంత జట్టు ముంబై తరఫున రంజీ రెండో దశ పోటీల్లో జమ్మూ కశ్మీర్‌పై ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసి నిరాశపర్చాడు. మరి వన్డే సిరీస్‌లో అయినా రాణిస్తాడేమో చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ కోసం సూపర్ స్టార్ మహేష్‌ బాబు..?
మాన్ ఆఫ్ మాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ వార్ 2. జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది ఆగష్టులో వార్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్‌ పాత్రలను తన వాయిస్ ఓవర్‌తో పరిచయం చేయనున్నాడట మహేష్ బాబు. సినిమా మొత్తంలో మహేష్ వాయిస్ ఓవర్ చాలా కీలకంగా వ్యవహరిస్తుందని టాక్. గతంలో కూడా మహేష్ బాబు పలు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు వార్ 2 కోసం మహేష్ వాయిస్ ఇస్తే సినిమా పై అంచనాలు ఓ రేంజ్ కు వెళతాయి. ఇక హిందీలో వచ్చేసి అనిమల్ హీరో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడట. వార్ 2 పాన్ ఇండియా సినిమా అవడంతో ఆయా భాషల్లో స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాను స్పై యూనివర్స్‌లో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ కోసం హై ఓల్టేజ్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. హృతిక్‌తో తలపడేలా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట యంగ్ టైగర్. బిగ్ స్క్రీన్ పై ఎన్టీర్, హృతిక్ రోష‌న్‌ వార్‌ పీక్స్‌లో ఉంటుందని అంటున్నారు. నెక్స్ట్ రానున్న సినిమాల్లో వెయ్యి కోట్లు రాబట్టగలిగే సత్తా వార్ 2కి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి వార్ 2 ఎలా ఉంటుందో చూడాలి.

డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ పూర్తి..
పద్మ భూషణ్ నందమూరి బాల‌కృష్ణ హీరోగా, యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘డాకు మ‌హారాజ్’. ప్రగ్య జైస్వాల్, శ్రద్ధ శ్రీనాధ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా నటించిన డాకు మహారాజ్ ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ క‌లెక్ష‌న్స్‌తో అద‌ర‌గొడుతోంది. సితార ఎంటెర్టైన్మెట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటి వరకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 170 కోట్లకు పైగా గ్రాస్, రూ.85 కోట్ల‌కుపైగా షేర్ క‌లెక్ష‌న్స్‌ రాబట్టింది. లాంగ్ రన్‌లో వంద కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్‌ను డాకు మ‌హారాజ్ ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. కాగా  గడచిన వీకెండ్ తో డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది. రూ. 85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో రిలీజ్ అయిన డాకు మహారాజ్ కేవలం 15 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ న దాటి లాభాల బాటలో పయనిస్తోంది. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ మరో రెకార్డును సొంతం చేసుకున్నాడు. సీనియర్ హీరోలలో వరుసగా అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా 4 సినిమాలు సూపర్ హిట్స్ కొట్టి రికార్డు బాలయ్య నెలకొల్పాడు. ఒక వైపు కంటిన్యూ హిట్స్ మరోవైపు భారతదేశ అత్యున్నత పురస్కారమైన పద్మ భూషణ్ రావడం నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cinema
  • india
  • international
  • national

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం!

  • Attack on US consulate in Karachi: ఇరాన్ సుప్రీం లీడర్ మరణం.. కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై దాడి

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Astrologer Trap: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని 9 రోజుల క్రితమే లవ్ మ్యారేజ్.. చనిపోతావని చెప్పిన జ్యోతిష్యుడు.. కట్ చేస్తే..

  • Sandeepa Virk :తీహార్ జైల్లో నరకం చూశాను.. గుర్తొస్తే ఇప్పటికీ భయం వేస్తుంది

  • Crude oil: ముడిచమురు సెగతో స్టాక్ మార్కెట్‌లో వణుకు.. రిలయన్స్, OMC కంపెనీల భవిష్యత్తు ఏంటి?

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions