ఢిల్లీ ఎన్నికల ఫలితాలో అదే జరిగింది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అందుకుంది.. దీంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.. బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జోరుగా సాగుతున్నాయి.. మరోవైపు.. బీజేపీ ఘన విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ విజయం చారిత్రాత్మకం.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత దేశం అని చెప్పుకోవడం గర్వంగా ఉంది అన్నారు.. ఢిల్లీలో వాయు కాలుష్యం.. రాజకీయ కాలుష్యం ఎక్కువగా ఉంది.. ఒక్కోసారి పరిస్థితి తారుమారు అవుతుంది.. ఇందుకు ఉదాహరణ ఢిల్లీ అన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీపై నమ్మకంతోనే ఢిల్లీ విజయం సాధ్యం అయ్యిందన్నారు.. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారని పేర్కొనర్నారు.. ప్రజల ఆదాయం ఎప్పటికప్పుడు పెరగాలి. ప్రజల ఆదాయం పెంచడం సమర్ధవంతంగా చేస్తే గుడ్ గవర్నెన్స్ అన్నారు చంద్రబాబు.. భారత్ లో ఆర్ధిక సంస్కరణలు వచ్చి 34 ఏళ్లు అయ్యింది.. 1991 ఆర్ధిక సంస్కరణలను ముందు.. తర్వాత.. రెండు విధాలుగా చూడాలి. పీవీ నరసింహారావు వల్ల ఆర్ధిక సంస్కరణలు జరిగాయి.. మహారాష్ట్రలో 1995 నుంచి ఇప్పటి వరకు గ్రోత్ రేట్ బాగా పెరిగింది.. అలాగే గుజరాత్‌లో కూడా గ్రోత్ రేట్ బాగా పెరిగిందని తెలిపారు.. లీడర్ కరెక్ట్‌గా ఉంటే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.. ప్రధాని మోడీ గొప్ప నాయకుడు.. రైట్ టైంలో రైట్ లీడర్‌షిప్ దేశానికి దొరికిందన్నారు.. అయితే, సంక్షేమం ఇస్తున్నామని మాయ మాటలు చెబుతున్నారు.. బటన్ నొక్కుతున్నామని అవినీతి చేస్తున్నారని ఆరోపించారు..
ఏపీకి.. ఢిల్లీకి దగ్గరి పోలికలున్నాయి.. లిక్కర్ పేరుతో సర్వ నాశనం చేశారు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఏపీకి, ఢిల్లీకి దగ్గరి పోలికలు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. లిక్కర్ పేరుతో సిస్టమ్ సర్వ నాశనం చేశారని మండిపడ్డారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం స్కాంతో పోల్చుకుంటే, ఢిల్లీలో జరిగిన స్కాం చాలా చిన్నది. మద్యం కుంభకోణంలో వచ్చే డబ్బు, పాపిష్టి డబ్బు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి, వేల కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు.. ఢిల్లీలో ఎక్కడ పోయినా చెత్త ఉంటుంది.. మెయిన్ రోడ్ లో కూడా చెత్త ఉంటుంది. ఢిల్లీలో హై పొల్యూషన్.. ఢిల్లీ టోటల్ ఫెయిల్యూర్ మోడల్ అన్నారు.. లిక్కర్ పేరుతో సిస్టమ్ సర్వ నాశనం చేశారు. ఋషికొండలో కూడా ఇదే పరిస్థితి.. ఎమ్మార్వో కార్యాలయాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు.. బటన్ నొక్కే కార్యక్రమం ఢిల్లీలో సక్సెస్ కాలేదు.. ఏపీలో కూడా ఇలాగే ఉండేదన్నారు చంద్రబాబు.. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది.. మౌలికవసతులు వస్తాయి. సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలికినట్లే అన్నారు సీఎం చంద్రబాబు… 1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలను తెలుగుబిడ్డ పీవీ తీసుకువచ్చారు. 1995-2024 మధ్య మన తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగిందని గుర్తుచేశారు.. ఇక, మోడీ వికసిత్ భారత్ 2047 తీసుకున్నారు.. మనం వికసిత్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నామని వెల్లడించారు.. మరోవైపు, నన్ను అరెస్ట్ చేసినప్పుడు 60 దేశాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి.. తెలంగాణలో నా అరెస్ట్ నిరసనలు అణచి వేయాలని చూసి ఫలితం అనుభవించారంటూ బీఆర్ఎస్ సర్కార్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.. ప్రపంచంలో ఇండియా నంబర్ వన్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందన్నారు.
చంద్రబాబు తన ట్రాక్ రికార్డు నిరూపించుకున్నారు.. మోడీ ప్రశంసలు..
దేశ ప్రజలు ఎన్డీయేపై పూర్తి విశ్వాసం చూపిస్తున్నారు.. చాలా రాష్ట్రాల్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది.. నిజమైన అభివృద్ధిని ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో చూడొచ్చు అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని.. బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర నిర్వహించిన విజయోత్సవాల్లో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఎన్డీఏ కూటమిలోని సీఎంల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు.. బీహార్‌లో నితీష్ కుమార్, ఏపీలో చంద్రబాబుతో కలిసి ఘన విజయం సాధించామన్ నమోడీ.. ఏపీలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డును నిరూపించుకున్నారంటూ ప్రశంసలు కురిపించారు.. పూర్వాంచల్ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోడీ.. నేను పూర్వాంచల్ నుంచి ఎంపీగా ఉన్నందుకు గర్వపడుతున్నాను అన్నారు.. ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించింది.. ఢిల్లీ ప్రజలకు ఈ రోజు పండగలాంటిది.. మాపై విశ్వాసం ఉంచిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు.. మీ విశ్వాసాన్ని అభివృద్ధి రూపంలో తీసుకొస్తాం అని హామీ ఇచ్చారు.. ఇకపై ఢిల్లీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఢిల్లీలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది.. ఈ విజయం కోసం ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడ్డారు.. ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను తిరిగి అనేక రెట్లు వారికిస్తాం.. ఢిల్లీలో విజయం సాధారణమైన విజయం కాదని అభివర్ణించారు..
‘మీసేవ’లో రేషన్ కార్డుల దరఖాస్తులు.. పౌరసరఫరాల శాఖ ఏం చెప్పిదంటే..?
మీసేవ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. మీసేవ ద్వారా కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని మాత్రమే “మీసేవ”ను కోరినట్లు పౌరసరఫరాల శాఖ కమిషన్ డీఎస్ చౌహాన్ తెలిపారు. మార్పులు, చేర్పులకు ఇప్పటికే మీసేవ ద్వారా దరఖాస్తులు అందుతున్నాయని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. కాగా.. ఈరోజు ఉదయం నుంచి జనాలు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఎగబడ్డారు. అక్కడ దరఖాస్తులు స్వీకరించకపోవడంతో గందరగోళం తలెత్తింది. మరోవైపు.. ఎమ్మె్ల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ దరఖాస్తులు స్వీకరించందని ప్రచారం జరిగింది. ఎన్నికల కమిషన్ నిలిపివేయలేదని, పౌరసరఫరాల శాఖ కానీ.. మీ సేవ కాని తమను సంప్రదించ లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడం లేదని పౌరసరఫరాల శాఖ తెలిపింది.
ఠాగూర్ సీన్ రిపీట్.. డెడ్ బాడీకి ట్రీట్‌మెంట్
వైద్యాన్ని వ్యాపారంగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు కొందరు డాక్టర్లు.. ఆసుపత్రిలో చేరే పేషెంట్ల ఆర్ధిక స్థితిని బట్టి.. వాళ్ల అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని డబ్బులు లాగేస్తున్న ఘటనలు నిత్యం ఏదో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమాలోని ఆసుపత్రి సీన్ గుర్తుందా? అప్పట్లో అది పెను సంచలనమే అయ్యింది. వ్యక్తి చనిపోయినా అతడు బ్రతికే ఉన్నాడంటూ అబద్ధం చెప్పి.. వైద్యం పేరుతో లక్షలకు లక్షలు ప్రైవేటు ఆసుపత్రులు కాజేస్తుంటాయని ఆ సినిమాలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఆ సినిమాలో చూపించినట్టుగానే.. రియల్ లైఫ్‌లోనూ కొన్ని సంఘటనలు జరిగాయి. తాజాగా.. అలాంటి ఘటన హైదరాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ అమ్మాయిని చికిత్స కోసం తీసుకురాగా, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ యువతి చనిపోయింది. ఈ ఘటన మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జరిగింది. సుహాసిని (26) అనే యువతికి కళ్ళు తిరిగి పడిపోతే కడప హాస్పిటల్ నుండి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకొచ్చారు బంధువులు. కానీ నెల రోజుల నుండి పేషెంట్‌కి ట్రీట్మెంట్ చేస్తున్నామని నమ్మబలికి 12 లక్షల 50 వేలు బిల్ కట్టించుకున్నారు.
బీసీల రిజర్వేషన్ల అంశంపై సీఎస్‌కు బీఆర్ఎస్ వినతిపత్రం..
సెక్రటేరియట్‌లో సీఎస్ శాంతికుమారితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సమావేశం అయ్యారు. అనంతరం సీఎస్‌కు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలుపర్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని.. కుల గణనలో బీసీల సంఖ్యను తగ్గించి చూపించిన కుట్రను సరి చేయాలని సీఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మధుసుదనా చారి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలనకు కొత్త భాష్యం చెప్తున్నారు.. పాలన అంటే భక్షించడం, శిక్షించడంలా చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా అనేక హామీలిచ్చారని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని సీఎస్‌ను కోరామని మధుసుదనా చారి తెలిపారు. ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి లేదు.. కులగణన రీ సర్వే జరపాలి, బీసీలకు ద్రోహం చేసే చర్యలను సహించమని పేర్కొన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీల పేరుతో బీసీలను కాంగ్రెస్ దగా చేసిందని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ మర్చిపోయినా.. తాము మర్చిపోలేదన్నారు. సర్వే పూర్తి స్థాయిలో జరగలేదు.. మళ్ళీ రీ సర్వే చేయాలని తెలిపారు. బీసీలకు న్యాయం జరగాలంటే బీసీ డెడికేషన్ డే పేరుతో సర్వే చేయాలని డిమాండ్ చేశారు. బీసీలను తొక్కే కుట్ర జరుగుతుంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తమిళనాడు తరహా కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలి.. చట్ట బద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని తెలిపారు. కేంద్రం కాళ్లు మొక్కి అయినా బీసీలకు 42 శాతం చట్టబద్ధంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
ఈ విషయంలో అన్నా హజారే కూడా సంతోషిస్తారు
అవినీతి పార్టీ ఓటమితో అన్నా హజారే కూడా ఎంతో సంతోషిస్తారని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత.. పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ మాట్లాడారు. అనినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే ఎంతో పోరాడారని.. ఇప్పుడు ఢిల్లీలో అవినీతి పార్టీ ఓటమితో హజారే కూడా ఎంతో సంతోషిస్తారని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టినవారు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. ఢిల్లీ తొలి అసెంబ్లీ సమావేశంలోనే కాగ్ రిపోర్ట్ పెడతామని మోడీ హెచ్చరించారు. ‘‘ఢిల్లీని వాయుకాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఆప్ ప్రభుత్వంలో యమునా కాలుష్యకాసారంగా మారిపోయింది.యమునాలో విషం కలిపారంటూ హర్యానా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారు. యమునాను ఆప్ ప్రభుత్వం అపవిత్రం చేసింది.. కాలుష్య కోరల నుంచి యమునా నదిని రక్షిస్తాం.. ఎంత కష్టమైనా యమునాను ప్రక్షాళన చేసి తీరుతాం.’’ అని మోడీ స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం పార్టీ సర్కార్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక ఓటమిని కేజ్రీవాల్ స్వాగతించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఘోర పరాజయం పాలయ్యారు.
వందే భారత్‌లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు ఖాళీ కడుపుతో ఉండాల్సిన అవసరం లేదు
ప్రధాని మోదీ కలల ప్రాజెక్ట్ వందేభారత్ రోజురోజుకు ఆదరణ పెంచుకుంటుంది. దేశ వ్యాప్తంగా వందే భారత్ సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఎప్పటి కప్పుడు పలు రూట్లలో కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతుంది. ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లలో ఓ లోపం ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తుంది. తాజాగా ప్రభుత్వం వందే భారత్ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు పెద్ద బహుమతిని అందించింది. రైల్వే ప్రయాణికుల కోసం కీలక ప్రకటన చేసింది. ఇకపై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు బుకింగ్ సమయంలో ఫుడ్ ఆఫ్షన్ ను ఎంచుకోకపోయినా ప్రయాణ సమయంలో రైలులో ఆహారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. వారు ఖాళీ కడుపుతో ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. వందే భారత్ రైలు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఫుడ్ ఆఫ్షన్ ఎంచుకోకపోయినా.. ప్రయాణ సమయంలో ఆహారం కొనుగోలు చేయవచ్చని రైల్వే బోర్డు తెలిపింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఈ మేరకు ఓ లేఖ జారీ చేసింది. వందే భారత్‌లో ప్రయాణీకులు టికెట్ సమయంలో ఫుడ్ ఆఫ్షన్ ఎంచుకోకపోయినా ప్రయాణ సమయంలో వారికి ఆహార సౌకర్యం కల్పించవచ్చని లేఖలో పేర్కొన్నారు.
కోటి మంది గిగా వర్కర్స్ కు గుడ్ న్యూస్.. ప్రభుత్వం పెద్ద బహుమతి
మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే రుచికరమైన ఆహారాన్ని మీ ఇంటి వద్దకే డెలివరీ చేసే డెలివరీ బాయ్ ఇప్పుడు పెన్షన్‌కు అర్హులు అవుతారు. డెలివరీ బాయ్స్, కొరియర్ బాయ్స్ సహా దేశంలోని ఒక కోటి మంది గిగా వర్కర్లకు ఎటువంటి ఉద్యోగం, జీతం లేదా రోజువారీ వేతనం లేకుండా చేసిన పని ఆధారంగా మాత్రమే జీతం పొందుతారు. అలాంటి వారు ఈ పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతారు. భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ముసాయిదా విధానాన్ని సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చించిన తర్వాత దీనిని అమలు చేస్తారు. భారత ప్రభుత్వం ప్రస్తుతం ఈ విధానంపై సంబంధిత పార్టీలన్నింటి మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తోంది. గిగా వర్కర్లకు పెన్షన్ సౌకర్యాన్ని ఇతర సామాజిక భద్రతా సంబంధిత సౌకర్యాలతో పాటు అందించడానికి, భారత ప్రభుత్వం ప్రతి గిగా వర్కర్ కు UAN అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ నంబర్ ద్వారా, గిగా వర్కర్లు ఏ ప్లాట్‌ఫామ్ లేదా కంపెనీతో పనిచేసినా, వారు పెన్షన్ లేదా సామాజిక భద్రతకు సంబంధించిన ఇతర సౌకర్యాల ప్రయోజనాలను పొందగలుగుతారు. దీని కోసం, వారు ఇ-శ్రమ్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా కూడా నమోదు చేసుకోవాలి. గిగా కార్మికులకు ఈ పెన్షన్ సౌకర్యం వారి లావాదేవీలతో అనుసంధానించబడుతుంది. అంటే, వారు ఎంత పని చేస్తారు లేదా డెలివరీ బాయ్‌గా ఎన్ని ప్రదేశాలకు వస్తువులను డెలివరీ చేస్తారు అనే దాని ఆధారంగా వారి పెన్షన్ సహకారం లెక్కిస్తారు.
రియల్ తండేల్ తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.. షాకింగ్ విషయాలు విన్నారా?
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్ తీయడానికి వెళ్లి అక్కడ అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ఎంటర్ అయ్యారు. వెంటనే వారిని పాకిస్తాన్ నేవీ అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టింది. సుమారు 16 నెలల జైలు జీవితం గడిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో పాకిస్తాన్ జైలు నుంచి శ్రీకాకుళం మత్స్యకారుల బృందం విడుదలైంది. వారిలో కొన్ని కథలను ఆధారంగా చేసుకుని ఒక సినిమా కథగా రూపొందించారు అదే ప్రాంతానికి చెందిన కార్తిక్ అనే యువకుడు. కార్తీక్ అందించిన కథకు చందు మొండేటి తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. నాగచైతన్య కెరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక నిజజీవిత తండేల్ రామారావు నూకమ్మ దంపతుల ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ తీసుకుంది వనితా టీవీ.. మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.
ఇక చాలు.. రెస్ట్ మోడ్ లోకి అల్లు అర్జున్?
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప 2 సినిమా ఎంత పెద్ద హెడేక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా 2000 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన థాంక్స్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈరోజు సాయంత్రం హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో ఈవెంట్ జరగబోతోంది. అయితే రేపు ఉదయాన్నే అల్లు అర్జున్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. తండేల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని బన్నీ వాసు వెల్లడించారు. నిజానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది కానీ ఆయనకు ఆరోజు అస్వస్థత ఏర్పడడంతో ఈవెంట్ కి హాజరు కాలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన రేపు ఉదయాన్నే వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నారు. నిజానికి పుష్ప 2 రిలీజ్ తర్వాత ఆయన వెకేషన్ కి వెళ్లాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఆయన దాన్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆయన వెకేషన్ కోసం సిద్ధమవుతున్నారు.