Home
Telangana
Telangana News
-
కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం…కరోనాపై కీలక నిర్ణయం తీసుకుంటారా?
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా మహమ్మారిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సంచారం. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటె, గతనెల 19 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన… -
దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఏపీ వేరియంట్…
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో వెలుగుచూసిన ఎన్ 440 కె వేరియంట్ రాష్ట్రంలో వేగంగా విస్తరించింది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వడానికి ఈ వేరియంట్ కారణం అని అంటున్నారు. ఈ వేరియంట్ ఇప్పుడు ఏపీతో పాటుగా పొరుగురాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్ 440 కె వేరియంట్ అధికంగా విస్తరిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఈ వేరియంట్ వ్యాప్తి 15 శాతం వేగంగా విస్తరిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలని,… -
కరోనా టెన్షన్: క్యూలైన్ లో ఆధార్ కార్డులు
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా భయంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో క్యూలు కడుతున్నారు ప్రజలు. కొన్ని చోట్ల పెద్ద సంఖ్యలో క్యూలు ఉంటున్నాయి. క్యూలైన్లో ఎక్కువ మంది నిలబడితే ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో ప్రజలు తమ వెంట తెచ్చుకున్న ఆధార్ కార్డులను క్యూలైన్లో ఉంచి దూరంగా నిలబడుతున్నారు. ఒకప్పుడు సినిమా హాళ్ల ముందు ఎక్కువ క్యూలైన్లు కనిపించేవి. ఈ కరోనా కాలంలో హాస్పిటల్స్ ముందు, వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో… -
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు…
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య రోజుకు 50కి పైగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మే 8 వ తేదీతో కర్ఫ్యూ సమయం పూర్తవుతుంది. అయితే, ఈరోజు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ సమయం పొడిగించాలని ఆదేశించింది. వీకెండ్ లాక్ డౌన్ పై ఎందుకు నిర్ణయం తీసుకోవాలని, ఈనెల… -
తెలంగాణ కరోనా అప్డేట్స్: ఆరు వేలకు పైగా కేసులు…51 మరణాలు
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6361 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,69,722 కి చేరింది. ఇందులో 3,89,491 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 77,704 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 51 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన… -
కేసీఆర్ కేబినెట్ లో ఈటలకు.. ఎప్పుడు కూడా గౌరవం తగ్గలేదు
ఈటెల రాజేందర్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. ఈటెల రాజేందర్ ప్రభుత్వం, సీఎం కెసిఆర్ పై విమర్శలు చేయడం శోచనీయమన్నారు. 2001లో టీఆరెస్ పార్టీని కేసీఆర్ పెడితే అనేక మంది 69 ఉద్యమంలో ఉన్న వాళ్ళు మమేకం అయ్యారని..ఈటల రాజేందర్ 2003 టీఆరెస్ పార్టీలో చేరారని కొప్పుల గుర్తు చేశారు. ఈటల రాజేందర్ కు గౌరవం దక్కలేదు అనే మాటలు అత్యంత సత్యదూరమని..రాజేందర్ కు గౌరవం ఇచ్చారు కాబట్టే మొదట కమలాపూర్ లో టికెట్… -
బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల రాజేందర్ : గంగుల
ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ మేకవన్నె పులి… ఈటల రాజేందర్ పచ్చి అబద్ధాల కోరని మండిపడ్డారు. బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల అని మంత్రి గంగుల ఫైర్ అయ్యారు.ఈటల రాజేందర్ కు సీఎం కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఉందా?.. ఈటల టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్నపుడు ఆ పదవిని దుర్వినియోగం చేశారని నిప్పులు చెరిగారు. బీసీలను దగ్గరకు రానీయలేదు.. ఈటల వ్యాపార భాగస్వామ్యులు… -
హైదరాబాద్ లో భారీ వర్షం… జలమయమైన రోడ్లు
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడిగా, ఎండగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం వరకు మారిపోయింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయం అయ్యాయి. వర్షం కురిసే ముందు ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. -
బంగారు తెలంగాణ శవాల తెలంగాణగా మారింది : బండి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికలు వస్తాయి పోతాయి… తెలంగాణ లో పరిస్థితి చూస్తుంటే బాధ వేస్తోంది. హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్, వెంటి లెటర్ లు లేవని అనేక పోన్స్ వస్తున్నాయి బంగారు తెలంగాణ శవాల తెలంగాణ గా మారింది. గుట్టలు గుట్టలు గా శవాలు ఉన్నాయి. బాధ,భయం తో యువకులు చనిపోతున్నారు. కోవిడ్ నియంత్రణకి ఏ జిల్లాకు నిధులు కేటాయించలేదు. పేదలు చనిపోతున్న… -
రాజీనామాకు సిద్దం : ఈటల సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ సిఎం కెసిఆర్, ఆయన కేబినెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్. అప్పుడు ఈటల తమ్ముడు అన్నారు.. ఇప్పుడు తమ్ముడు దెయ్యం ఎలా అయ్యిండు? అని కెసిఆర్ ను నిలదీశారు. మీరు బీ ఫామ్ ఇచ్చారు… నేను గెలిచా… నా కారు గుర్తు మీదనే గెలిచారని అంటారు కాబట్టి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఈటల రాజేందర్ అన్నారు. తాను తన నియోజకవర్గ ప్రజల దగ్గర వెళ్లి, వాళ్ళ సలహాలు సూచనలు…
తాజావార్తలు
-
Trump: తేడాలు చేస్తే ఒమన్‌ను కూడా లేపేస్తాం.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
-
Trump: ఇరాన్‌కు ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు దక్కనివ్వను.. ట్రంప్ శపథం
-
Shrasti Verma : బీజేపీలో చేరిన కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ
-
E20 Ethanol Demand: E20 తర్వాత అసలు సవాలు ఏంటి?.. ఆహారం, నీటిపై ఒత్తిడి తప్పదా?
-
Minister Ponguleti: 22A నుంచి 32 వేల భూములకు విముక్తి.. నిషేధిత భూములపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!