Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Real Reason Behind Movie Interval: థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో స్క్రీన్‌పై ‘ఇంటర్వెల్’ అంటూ బ్రేక్ రావడం మనందరం ఎప్పటినుంచో చూస్తున్నాము. సినిమా కథలో కీలకమైన మలుపు తర్వాత వచ్చే ఈ విరామం ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతుంది. అయితే అసలు సినిమా మధ్యలో ఈ ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో అని ఎప్పుడైనా ఆలోచించారా?. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కొనుకుంనేందుకు ఈ బ్రేక్ కాదు. అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.
ఒకప్పుడు సినిమాలను ప్రస్తుతంలా డిజిటల్ టెక్నాలజీతో కాకుండా.. ఫిల్మ్ రీళ్లతో ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించేవారు. ఒక రీల్ పూర్తయిన తర్వాత మరో రీల్‌ను ప్రొజెక్టర్‌లో అమర్చేందుకు కొంత సమయం పట్టేది. సాధారణంగా ఈ ప్రక్రియకు సుమారు 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టేది. ప్రేక్షకులను ఖాళీగా కూర్చోబెట్టకుండా ఆ సమయంలో విరామం ఇచ్చేవారు. అలా సినిమాల్లో ‘ఇంటర్వెల్’ అనే సంప్రదాయం మొదలైంది. కాలక్రమేణా సాంకేతికతలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఫిల్మ్ రీళ్ల స్థానంలో డిజిటల్ ప్రొజెక్షన్ అందుబాటులోకి రావడంతో.. రీళ్లు మార్చాల్సిన అవసరం లేకుండా పోయింది. అయినప్పటికీ ప్రేక్షకులకు అలవాటైన ఇంటర్వెల్‌ను తొలగించలేదు. క్రమంగా అది సినిమా ప్రదర్శనలో ఒక భాగంగా, భారతీయ సినిమా సంస్కృతిలో ప్రత్యేకమైన సంప్రదాయంగా మారిపోయింది.
Also Read
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
అయితే ఇప్పుడు ఈ ఇంటర్వెల్ సమయం థియేటర్ యాజమాన్యాలకు అదనపు ఆదాయ వనరుగా మారిందనే చెప్పాలి. ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులు పాప్‌కార్న్, చిప్స్, సమోసా, కూల్‌డ్రింక్స్ వంటి తినుబండారాలను కొనుగోలు చేస్తుంటారు. ఒకప్పుడు తక్కువ ధరకు దొరికే ఈ పదార్థాలు ఇప్పుడు చాలా ఖరీదైనవిగా మారాయి. చివరకు తక్కువ ధరలో లభించే వాటర్ బాటిల్ కూడా థియేటర్లలో అధిక ధరకు విక్రయిస్తున్నారు. టికెట్ ధరతో పోలిస్తే ఇంటర్వెల్ సమయంలో తినుబండారాలపై చేసే ఖర్చు ఎక్కువగా ఉంటోందని ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబంతో కలిసి సినిమా చూడటానికి వెళితే టికెట్లతో పాటు స్నాక్స్, డ్రింక్స్ వంటి వాటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒక మధ్యతరగతి కుటుంబం సినిమా చూసేందుకు వెళితే.. టికెట్లు, తినుబండారాలు, ఇతర ఖర్చులు కలిపి సుమారు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఖర్చవుతున్న పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు రీల్ మార్చేందుకు అవసరమైన సాంకేతిక విరామంగా మొదలైన ఇంటర్వెల్.. ఇప్పుడు ప్రేక్షకులకు అదనపు ఖర్చుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!