Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra Thar 2026: మహింద్ర అభిమానులకు, ముఖ్యంగా ఆఫ్‌రోడ్ ప్రేమికులకు త్వరలోనే గుడ్‌న్యూస్ రానుంది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘మహింద్రా థార్’ ఎస్యూవీ మరోసారి కొత్త రూపుతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 2025లో తొలి అప్డేట్ అందుకున్న ఈ కారును, సరిగ్గా ఏడాది తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరి నాటికి మళ్లీ అప్డేట్ చేసి లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మహింద్రా సంస్థ అధికారికంగా ధృవీకరించనప్పటికీ, సెప్టెంబర్ నెలలోనే ఇది మార్కెట్లోకి అడుగుపెట్టవచ్చని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న థార్ డిజైన్ 2020లో లాంచ్ అయినప్పటి నుంచి దాదాపు అలాగే కొనసాగుతోంది. అందుకే ఈసారి దీనికి మరింత గ్లామరస్, ట్రెండీ లుక్ ఇచ్చేందుకు మహింద్రా ప్రణాళికలు రచిస్తోందట. ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించిన ఆధారాల ప్రకారం, ఈ కొత్త ఎస్యూవీ రీఫ్రెష్డ్ లుక్‌తో రానుందట. ఇందులో సరికొత్తగా డిజైన్ చేసిన ఐదు స్లాట్ల ఫ్రంట్ గ్రిల్, మోడిఫై చేసిన బంపర్లు, మార్పులు చేసిన ఎల్ఈడీ హెడ్‌లాంప్స్, అట్రాక్టివ్‌గా ఉండే కొత్త ఐదు డబుల్ స్పోక్ అల్లాయ్ వీల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. ఇవి కారుకు మరింత అప్స్కేల్, రీఫ్రెష్డ్ లుక్‌ను అందిస్తాయట.
కేవలం ఎక్స్టీరియల్లోనే కాకుండా, కారు లోపల కూడా అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయట. ఇంటిరియర్లో సరికొత్త అప్హోల్స్టరీతో పాటు స్టైలింగ్, ఫంక్షనల్ పరంగా పలు అప్డేట్స్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఈ కొత్త థార్‌లో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రయాణాన్ని మరింత సుఖమయం చేసే వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కారులోకి సులభంగా వెళ్లేందుకు వీలుగా ప్యాసివ్ కీలేస్ ఎంట్రీ వంటి ప్రీమియం టెక్నాలజీ, కంఫర్ట్ ఫీచర్లను జోడిస్తున్నారని టాక్.
Also Read
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
అయితే కారు లుక్, ఫీచర్లలో ఎన్ని మార్పులు చేసినా, దీని పవర్ ఫుల్ ఇంజిన్ పనితీరులో మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుత మోడల్లో ఉన్న మూడు ఇంజిన్ ఆప్షన్లనే ఇందులోనూ కొనసాగించనున్నారు. అందులో 1.5 లీటర్ డీజిల్ (117 హెచ్‌పీ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్), 2.2 లీటర్ డీజిల్ (130 హెచ్‌పీ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్), 2.0 లీటర్ పెట్రోల్ (150 హెచ్‌పీ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్) ఇంజిన్లు ఉన్నాయి. కస్టమర్ల సౌకర్యార్థం 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో పాటు, ఈ ఎస్యూవీ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సామర్థ్యంతో రానుందట. కొత్త డిజైన్, అదనపు ఫీచర్లతో రాబోతున్న ఈ థార్ కచ్చితంగా ఆటోమొబైల్ ప్రేమికులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!