తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు జారుతున్నది. లాక్ డౌన్ అమలులో ఉండటంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపులు ఇచ్చారు. నాలుగు గంటలపాటు లాక్ డౌన్ కు సడలింపులు అనటంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకు రావడంతో రద్దీ ఏర్పడింది. లాక్ డౌన్ కారణంగా నగరంలోని ప్రజలు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. బస్సులు తక్కువగా ఉంటడం, ఉదయం 10 గంటల తరువాత బస్సులు ఆగిపోతుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇక ఉదయం 10 గంటల తరువాత రోడ్లమీద ఉన్న ప్రజలను వెనక్కి పంపుతున్నారు పోలీసులు. సెకండ్ వేవ్ లో కరోనా కేసులు అధికంగా ఉండటంతో ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తున్నారు. ఉదయం 10 గంటల తరువాత రోడ్ల మీద ఉండకుండా తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు.