CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని సీఎం ఆదేశించారు.
కేంద్ర మంత్రి బండిసంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ళ కోసం కేంద్రం నిధులు ఇచ్చింది.. అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు ఇచ్చింది.. వరి, ఇతర పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని తెలిపారు.. కాంగ్రెస్ వంద రోజులలో అరు గ్యారంటీలని అటకెక్కించింది.. అరు గ్యారంటీలు అడిగినప్పుడల్లా టాపిక్ డైవర్ట్ చేస్తుందని మండిపడ్డారు.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. వరిధాన్యంకి బోనస్…
ప్రాంతీయ పార్టీల రాజకీయమంతా... కుటుంబాల చుట్టూ తిరగడం, అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఏవైనా పొరపొచ్చాలొస్తే... ఆయా పార్టీలు నిలువెల్లా షేకైపోవడం సర్వ సాధారణమైంది. దేశమంతటా ఇదే తరహా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ పరంపరలోనే... తాజాగా తెలంగాణ వంతు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో అన్నా చెల్లెలు జగన్, షర్మిల మధ్య నడుస్తున్న వివాదాలు, జరిగిన, జరుగుతున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కిడ్నీ రాకెట్ మాఫియాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. సరూర్‌నగర్‌లో అలకనదం హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ కొనసాగింది. సరూర్‌నగర్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును, ఇటీవలే సీఐడీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 13మంది అరెస్ట్ కాగా... మరో ఏడుగురి కోసం గాలింపు చేపడుతున్నారు. కిడ్నీ రాకెట్ సూత్రధారి పవన్ అలియాస్ లియోన్ శ్రీలంక నుంచే దందా నడిపినట్లు తెలిసింది.
నేటితో ముగియనున్న వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్ కస్టడీ.. టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో ఇప్పటికే రెండు రోజులు విచారించిన తుళ్లూరు పోలీసులు నేడు గుంటూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ.. తెనాలిలో నడిరోడ్డుపై జాన్ విక్టర్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు కొట్టడానికి నిరసనగా ఆందోళన వల్లభనేని వంశీని నేడు ఆసుపత్రికి తరలించనున్న పోలీసులు.. హైకోర్టు ఆదేశాల మేరకు వంశీని విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చేర్చనున్న పోలీసులు.. ప్రస్తుతం విజయవాడ సబ్…