శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద నీరు తగ్గుతుంది. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో ఎగువ నుండి వచ్చిన వరద కారణంగా పెరిగిన ఇన్ ఫ్లో ఇప్పుడు తగ్గుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 45,111 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 28,252 క్యూసెక్కులు గానే ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 842.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం…
గత కొన్ని రోజులగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో పాటుగా రుతుపవనాలు చురుగ్గా సాగుతుండటంతో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్ లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఈ వర్షానికి రోడ్లు, పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు, జలాశయాలు నిండుకుండలా మారాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. Read:…
కరోనా సెకండ్ వేవ్‌లో కేసులు తక్కువగా నమోదవుతున్నా, ఇంకా పూర్తిగా నియంత్రలోకి రాలేదు. మొదటి వేవ్‌లో ఆల్ఫారకం వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందితే, రెండో దశలో డెల్టావేరియంట్ వ్యాప్తి అధికంగా ఉందని, సెకండ్ వేవ్ లో వ్యాప్తి చెందుతున్న ఈ డెల్టా వేరియంట్ కు వ్యాప్తిచెందే గుణం అధికంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇలాంటి సమయంలో సెకండ్ వేవ్ తొలగిపోయిందని అనుకోవడం పోరపాటే అని, తప్పని సరిగా మాస్కులు ధరించాలని తెలియజేసింది. నిబంధనలు ఉల్లంఘించి…
తెలంగాణలో బోనాల సీజన్ ప్రారంభమైపోయింది.. ఇప్పటికే బోనాల పాటలు అదరగొడుతున్నాయి.. ప్రతీ పండుగకు ఓ పాట విడుదల చేసినట్టుగానే.. ఈ సారి కూడా ఓ పాటను వదిలారు సింగర్ మంగ్లీ.. అయితే, పాటలోని కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.. బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారంటూ మంగ్లీపై రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్పొరేటర్లు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని పేర్కొన్న నేతలు.. తక్షణమే…
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 657 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… మరో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 704 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,38,030 కు చేరుకోగా.. ఇప్పటి వరకు 6,24,477 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. మృతుల సంఖ్య 3,766కు పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.87…
కరోనా వైరస్ ఓ వైపు కల్లోలం సృష్టిస్తుంటే.. మరోవైపు సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు.. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు.. తాజాగా సైబర్ కేటుగాళ్ల బాధితుల జాబితాలో ఓ 77 ఏళ్ల వృద్ధుడు చేరాడు.. సరదాగా డేటింగ్ అంటూ చాటింగ్‌తో స్టార్ట్ అయ్యి.. చివరకు రూ.11 లక్షలు పోగుట్టుకున్న తర్వాత గానీ ఆ వృద్ధుడికి తాను చీటింగ్‌కు గురయ్యాను అనే సంగతి తెలిసిరాలేదు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఓ 77 ఏళ్లు వృద్ధుడు..…
కృష్ణా నది జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం సాగగా… కేంద్ర ప్రభుత్వం గెజిట్లతో వివాదాలకు తెరదింపాలని చూసింది.. కానీ, వాటిపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. మరోవైపు.. కృష్ణా నదీ జలాలను 50:50 నిష్పత్తిలో పంచాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డును లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ ఛీప్ మురళీధర్‌రావు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు…
కరోనా మహమ్మారి విజృంభణతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి… ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణలో వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి… ఇదే, సమయంలో.. సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. అయితే, మల్టీప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో మాత్రం యాథావిధిగా నో పార్కింగ్ ఫీజు విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో…
సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు.. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు.. ఈ మేరకు ఈనెల 26 తేదీన జరిగే బోర్డు మీటింగ్‌లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు.. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43,899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనున్నది.…