Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Gottipati Ravikumar: రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు ఉండకూడదని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్నా, ప్రజలకు అంతరాయం లేకుండా నిరంతర సరఫరా అందించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ సీఎండీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి కీలక సూచనలు చేశారు. అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు విధించకూడదని కఠినంగా ఆదేశించారు. ఒకవేళ సాంకేతిక సమస్యల కారణంగా విద్యుత్ సరఫరా aఅంతరాయం కలిగితే, వెంటనే ప్రజలకు సమాచారం ఇవ్వడంతో పాటు సమస్యను త్వరగా పరిష్కరించాల్సిందిగా సూచించారు.
Also Read
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
ఇక, వేసవి డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఫిర్యాదులు రావడం ఎందుకని ఆరా తీశారు మంత్రి గొట్టిపాటి.. దీనికి అధికారులు సమాధానమిస్తూ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, అకాల వర్షాల వల్ల విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడం వంటి కారణాలతో తాత్కాలిక సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేలా సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. వేసవిలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండే నేపథ్యంలో, ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?