తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హీట్ పుట్టించిన జగ్గారెడ్డి ఇష్యూ చల్లబడినట్టే అనిపించింది.. అయితే, జగ్గారెడ్డి పదవులకు కోత విధిస్తూ తెలంగాణ పీసీసీ తీసుకున్న నిర్ణయంతో.. మరోసారి పార్టీలో కాక రాజేసినట్టు అయ్యింది.. ఇక, ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మరోవైపు పీసీసీ చర్యపై మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నారు జగ్గారెడ్డి.. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ప్రతినిధులు ఓసారి జగ్గారెడ్డిని ప్రశ్నించారు.. ప్రస్తుతం నాతో భట్టి, ఉత్తమ్ సహా ఎవరూ మాట్లాడట్లేదన్న ఆయన..…
దేశంలో బాలికల చట్టబద్ద పెళ్లి వయసు 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం 20 ఏళ్లకే అమ్మాయిలు పెళ్లి చేసేసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 2014 నుంచి 20ఏళ్ల వయసు లోపు పెళ్లైన యువతుల సంఖ్య 4.18 లక్షలుగా ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కోసం కొంత మంది తల్లిదండ్రులు ఆధార్ కార్డుల్లో తమ పిల్లల వయసు పెంచి చూపిస్తున్నారు. కళ్యాణ లక్ష్మీ…
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఛలానాల క్లియరెన్స్ కొనసాగుతోంది. పెండింగ్ ఛలాన్ల కోసం తెలంగాణ పోలీస్ శాఖ ఇచ్చిన రాయితీలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. సుమారు 1.2 కోట్ల పెండింగ్ ఛలానాల ద్వారా రూ.112.98 కోట్లు జమ అయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 63 లక్షల ఛలాన్లు క్లియర్ కాగా.. వీటి ద్వారా రూ.49.6 కోట్లు వాహనదారులు చెల్లించారు.…
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత.. పార్టీలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. ఇదే సమయంలో.. ఆయను టార్గెట్ చేసే బ్యాచ్ కూడా పెద్దదే.. క్రమంగా అందరితో కలిసిపోయే ప్రయత్నాలు జరుగుతున్నా.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై డైలాగ్స్ పేల్చడంలో… జగ్గారెడ్డి ముందు వరుసలో ఉన్నారు.. పార్టీ వ్యక్తిగత ఇమేజ్ కోసం రేవంత్ పని చేస్తున్నారంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. సీనియర్స్ సమావేశం తర్వాత… ఏకంగా రేవంత్‌కే సవాల్ విసిరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి…
గోదావరి నీళ్లతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి పాదాలు కడగాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ నుంచి యాదాద్రికి అధికారులు నీరు విడుదల చేశారు. ఈ మేరకు ఆఫ్టేక్-2 నుంచి గోదావరి జలాలు యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లికి చేరుకున్నాయి. అటు నుంచి ఈ గోదావరి జలాలు యాదాద్రి నారసింహుడి చెంతకు చేరాయి. యాదాద్రి ఆలయంలో పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభమైన రోజే గండి చెరువును అధికారులు కాళేశ్వరం నీటితో నింపారు.…
దేశవ్యాప్తంగా సుదీర్ఘ విరామం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో సుమారు ఐదు నెలల తర్వాత ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా బ్యారెల్ చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇంధన ధరలు పెరగడం ప్రారంభించాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర…
★ నేడు ప్రపంచ నీటి దినోత్సవం★ నేడు కడప చేరనున్న కువైట్‌లో మృతిచెందిన వెంకటేష్ మృతదేహం.. కువైట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన కడప జిల్లా వాసి వెంకటేష్★ తిరుమల: నేడు మే నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ, బుధవారం నాడు జూన్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల★ నేడు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. జగ్గారెడ్డి వ్యవహారంపై అధిష్టానంతో చర్చించనున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి★ నేడు…
2021-22 ఆర్థిక సంవత్సరం ముగింపు కొస్తున్నా వేతనాలు, బకాయిలు విడుదల కాకపోవడం పట్ల యుఎస్పీసీ ఆందోళన వ్యక్తం చేసింది. పెండింగ్ బిల్లుల మంజూరు కోరుతూ బుధవారం డిటిఓ ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని యుయస్పీసీ తెలిపింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లుల సత్వర మంజూరు కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం జిల్లా ట్రెజరీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు యుయస్పీసీ స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. ఉపాధ్యాయులు,…