ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? పెట్రోల్ , డీజిల్ పై వ్యాట్ తగ్గించడంతో వివిధ రాష్ట్రాలు తగ్గించాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించాయి.తెలుగు రాష్ట్రాలు కూడా తగ్గించాలని కేంద్రం కోరింది.
ఇది పరీక్షల కాలం. తెలంగాణలో రెండురోజుల క్రితమే ఇంటర్ పరీక్షలు ముగిశాయి. తాజాగా రేపటి నుండి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. జూన్ 1 వరకు పరీక్షలు జరుగుతాయి. రెండేళ్ల తర్వాత జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు అంతా సిద్ధం చేశారు అధికారులు. ప్రతి రోజూ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష వుంటుంది. ఐదు లక్షల 9వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2861…
ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని పేర్కొంది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు…
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ తీరుపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. స్నేహపూర్వకంగా వుండే రాష్ట్ర ప్రభుత్వాలంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వాలను అస్సలు పట్టించుకోరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రైతుల కోసం ఏం చేసినా కేంద్రానికి నచ్చదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ‘రైతు పోరాటానికి మా మద్దతు ఉంటుంది. తెలంగాణ ఏర్పడక ముందు కరెంట్ కోతలు తీవ్రంగా ఉండేవి. రోజుకు 10మంది రైతులు చనిపోయేవారు. వ్యవసాయంపై ఇప్పటికీ కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. మోటార్లకు మీటర్లు పెట్టాలని…
కోవిడ్ ఆర్థిక పరిస్థితులు, ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని, ఆ ఎఫెక్ట్ అమెరికా వంటి దేశాలతో పాటు భారత్ పై కూడా పడిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కొద్ది రోజుల కింద ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్రం ఛార్జీలు తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాట్ తగ్గించలేదు. అటల్ బిహారీ వాజ్ పేయి ఫౌండేషన్ స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బీజేపీ…
రాష్ట్రంలో ప్రజలందరూ అనేక సమస్యలతో బాధపడుతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి మాత్రం దేశమంతా తిరుగుతున్నాడని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జిల్లా బీజేపీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందులను గుర్తించే స్థితిలో ముఖ్యమంత్రి లేడు. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 30 రూపాయల జీఎస్టీ విధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 65 వేల కోట్లు లబ్ధి…
ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా వున్నారు సీఎం కేసీఆర్. సీఎం కేజ్రీవాల్ నివాసంలో కేసీఆర్ భేటీ ముగిసింది. గంటన్నర పాటు కేసీఆర్, కేజ్రీవాల్ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం చండీగఢ్ బయలు దేరారు సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్. కేసీఆర్ కారులోనే బయలు దేరారు కేజ్రీవాల్. ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చండీగఢ్‌కు పయనమయ్యారు. గాల్వన్ వ్యాలీ అమరవీరుల జవానులకు నివాళులు అర్పించారు కేజ్రీవాల్, కేసీఆర్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. అనంతరం రైతు ఉద్యమంలో చనిపోయిన 600 రైతు…
పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. దీంతో, సామాన్యుడికి ఊరట లభించినట్టు అయ్యింది.. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన బండి సంజయ్.. తెలంగాణలోనూ కేసీఆర్ పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనికితోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంవల్ల నిత్యావసర వస్తువుల దిగుమతులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ దేశ…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తెలంగాణలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించారు.. అదేంటి చంద్రబాబు… ప్రభుత్వ ఆస్పత్రిలో.. అది కూడా తెలంగాణలో ప్రారంభించడం ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. అవును ఇది నిజమే.. మహబూబాబాద్ జిల్లాలో గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను వర్చ్యువల్ పద్ధతిలో ప్రారంభించారు చంద్రబాబు.. రూ. 50 లక్షల ఖర్చుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.. Read Also: Viral:…