వికారాబాద్ జిల్లా దోమ మండలం పీర్లగుట్ట తాండాలో విషాదం నెలకొంది. తనను ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపానికి గురైన నేనావత్ లక్ష్మి (19) అనే యువతి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుల్కచర్ల మండలం గోన్యా నాయక్ తండాకు చెందిన రాహుల్ తనను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని...