Montha Cyclone: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హన్మకొండ, హైదరాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూలు, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి-భువనగిరి…
Rajanna Sircilla District: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్‌లో ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంతో ఓ ఇంటిపై పిడుగుపాటు చోటుచేసుకుంది. పట్టణంలోని భగవంతు రావునగర్‌లో నివాసముంటున్న చిలుకల దేవయ్య ఇంటిపై అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఇంట్లో ఉన్న టెలివిజన్, ఫ్రిజ్, ఫ్యాన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నాయి. ఇంటి పైభాగంలోని గోడకు పిడుగు తగలడంతో కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Pocharam Project : కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్ట్ ప్రమాదంపు అంచున చేరింది. భారీగా వరదనీరు పైనుంచి వస్తుండటం వల్ల పది అడుగుల ఎత్తులో అలుగు దుంకుతోంది. అలుగు పక్కన ఉన్న మట్టికట్టను ఢీకొట్టి మరీ దాని మీద నుంచి పొంగిపొర్లుతోంది. వరద తాకిడి స్థాయికి మించి ఉండటంతో ఏ క్షణంలో అయినా మట్టి కట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే దిగువన ఉన్న వందలాది ఎకరాలు…
Yellow and Orange Alerts Issued for Several Districts in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ సహా జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దాంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అవసరం ఉంటే తప్ప..…
Heavy Rains Today andmorrow in Telangana: హైదరాబాద్ వాతావరణశాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాంధ్ర తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. సోమ, మంగళ వారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, జనగామ, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్…
రేపు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, ఉమ్మడి కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది.. ఈదురు గాలులతో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని.. రైతులతో పాటు సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా పిడుగులు సైతం పడే అవకాశం ఉంది. అందుకే వర్షం వచ్చే సమయంలో చెట్ల కింద…