తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల నిర్మాణానికి స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద కేంద్రం రూ.300 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది.స్వదేశ్ దర్శన్ పథకంలో రాష్ట్రంలో 3 పర్యాటక సర్క్యూట్స్ అభివృద్ధికి రూ.268.39 కోట్లు, ప్రసాద్ పథకం కింద రూ.36.73 కోట్ల మంజూరు చేసింది. బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీబండి సంజయ్ కుమార్ రాసిన లేఖకు సమాధానమిస్తు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి…