మూడు రోజుల పాటు ఏక దాటినా వచ్చిన వర్షాలకి పాలేరు రిజర్వాయర్ నుంచి భారీ ఎత్తున వరద వచ్చింది. పాలేరు రిజర్వాయర్ సామర్ధ్యాన్ని మించి వరదలు వచ్చాయి రిజర్వాయర్లో 21 అడుగుల సామర్థ్యం ఉంటే దాదాపుగా 39 అడుగుల సామర్థ్యం స్థాయి వరద పాలేరుకు వచ్చింది సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీరు పాలేరు రిజర్వాయర్ కి రావటంతో దాని ప్రభావం కాలువల మీద పడింది. వరద కూడా సాగర్ కాలువల మీద పడింది. దీంతో పాలేరు నుంచి వెళ్లే నాగార్జునసాగర్ కాలవలు గండ్లు పడ్డాయి .పాలేరు సమీపంలోనే రెండు చోట్ల గండిపడగా మరోచోట మరో రెండు గండ్లు పడ్డాయి. మొత్తం నాలుగు గండ్లు పడటంతో జల విద్యుత్ కేంద్రం అదే విధంగా మత్స్య ఉత్పత్తి కేంద్రం పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 15 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిలిందని అంచనా వేస్తున్నారు.
Chamala Kirankumar Reddy : వానలు వచ్చినా, వరదలు వచ్చినా కేటీఆర్‌కు పట్టదు