తెలంగాణ రాష్ట్రంకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా కరీంనగర్, ములుగు, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. తప్పనిసరి అయితేనే బయటికి రావాలని ప్రజలకు సూచింది. Also…
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దూకుడుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారమైన పంట నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం, మొత్తం 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వరద పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లు, భవనాల (R&B) శాఖకు చెందిన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిపై ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే స్పందించారు.
గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం.. సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కొలువుదీరిన గణేషుడు భక్తుల నుంచి పూజలందుకుంటున్నాడు. పూజలు, భజనలతో గణపయ్య భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా కొందరు మూడో రోజు నుంచే నిమజ్జనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం అని తెలిపారు. ఈ ఏడాది నిమజ్జనానికి 30 వేల మంది…
తెలంగాణలో వర్షాల ప్రభావం కొనసాగుతూనే ఉంది. అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather Update: తెలంగాణ రాష్ట్రం అంతటా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అనేక జిల్లాల్లో రోడ్లు జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. గౌరారంలో 23.5 సెం.మీ, ఇస్లాంపూర్‌లో 17.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. కౌడిపల్లి, చిన్నశంకరంపేట, దామరంచ, మాసాయిపేటల్లో కూడా 15–17 సెం.మీ వరకు వర్షాలు కురిశాయి. సిద్ధిపేట…
IMD Issues Red Alert for 4 Districts in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరో పదకొండు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ…