Danam Nagender : నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు
- అనర్హత పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్
- అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌కు వినతి
- నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు
- బీఆర్ఎస్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు నాకు సమాచారం లేదు
- నేను 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లా
- నేను కాంగ్రెస్ సమావేశానికి వ్యక్తిగత హోదాలో వెళ్లా-దానం నాగేందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారంలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై, ఆయన స్పీకర్ కు వినతిపత్రం అందజేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను దానం నాగేందర్ ఘాటుగా ఖండిస్తూ, ఆ పిటిషన్‌ను కొట్టి వేయాలని స్పీకర్‌ను కోరారు. అఫిడవిట్‌లో దానం నాగేందర్ తాను బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, అలాగే పార్టీ తనను సస్పెండ్ చేసినట్లు సమాచారమూ అధికారికంగా తనకు అందలేదని స్పష్టం చేశారు.
Beat the Heat : ఏసీ లేకపోయినా మీ ఇల్లు కూల్‌గా ఉండాలా..? ఈ సింపుల్ ట్రిక్స్ పాటించండి.!
Also Read
మార్చి 2024లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి హాజరైన విషయాన్ని అంగీకరించినప్పటికీ, అది పూర్తిగా వ్యక్తిగత హోదాలో జరిగినదేనని చెప్పారు. ఒక పార్టీ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరవడమే ఫిరాయింపుగా పరిగణించడాన్ని ఆయన తప్పుబట్టారు. మీడియా కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్లు బీఆర్‌ఎస్ భావించడం అనుచితమని, ఆ నిర్ధారణకు చట్టపరమైన ఆధారాలు లేవని చెప్పారు. అనర్హత పిటిషన్ రాజకీయ ప్రయోజనాల కోసం దాఖలు చేయబడిందని వాదించిన దానం నాగేందర్, పిటిషన్‌లో బలం లేదని, అందువల్ల దానిని కొట్టి వేయాలని స్పీకర్ కోర్టును కోరుతూ తన అఫిడవిట్‌ను ముగించారు.
IRCTC Refund Hack: రైలు మిస్ అయినా లేదా ఆలస్యమైనా.. రూపాయి పోకుండా రీఫండ్ పొందే ట్రిక్ ఇదే.!
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్‌ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!