కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు..ఆదే నోరు జారితే? తీసుకోవటం కుదరదు. నరంలేని నాలుక ఏమైనా అంటుంది. ఇప్పుడు కొందరు నేతలకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ప్రస్తుతం రాజకీయాలంటేనే తిట్ల పురాణంలా మారింది. ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు ..తిట్టు ..ప్రతి తిట్టు. ఇప్పుడు ఇదే ట్రెండ్. నిన్న బండి వర్సెస్ మైనంపల్లి. తాజాగా రేవంత్ వర్సెస్ మల్లారెడ్డి. ఈ రెండు ఎపిసోడ్లలో నేతల భాషా ప్రావిణ్యాన్ని చూడోచ్చు. వాటిని ఆరోపణలు ప్రత్యారోపణలు అంటారా…లేదంటే తిట్లు ప్రతి తిట్లని…
తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి… సీఎం కేసీఆర్ పై తెలంగాణ ప్రజలలో విశ్వాసం పోయిందన్న ఆయన.. కేసీఆర్ వ్యవహార శైలి వల్ల తెలంగాణ ఉద్యమకారులు నిరాశకు గురవుతున్నారన్నారు.. తెలంగాణలో కేసీఆర్, టీఆర్ఎస్ వ్యతిరేకుల పునరేకీకరణ జరుగుతుందన్న రేవంత్… సీఎం కేసీఆర్ను తెలంగాణ సమాజం త్వరలో తిరస్కరిస్తుంది.. మేధావులు, మీడియా దీన్ని గమనించాలని సూచించారు.. ఇక, రాబోయే రోజులలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీని వీడి…