1.తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. మంత్రులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు.. ఎర్రవెల్లిలోని తమ ఫామ్‌హౌస్‌కి రావాలంటూ ఆయన నుంచి మంత్రులకు సమాచారం వెళ్లింది.. అయితే, ఆకస్మాత్తుగా భేటీ కావడంతో.. ఏ అంశాలపై చర్చిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ భేటీలో మంత్రులతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫోన్ కాల్ రావడంతో.. హుటాహుటిన తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని.. ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్…
2.గ్రామ స్వరాజ్యం అంటూ మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని చేసి చూపిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. ఎంపీటీసీ సభ్యులకు, కో-ఆప్షన్ సభ్యులకు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ప్రొగ్రామ్‌లో ఆయన మాట్లాడుతూ.. అందరికీ అభినందనలు తెలిపారు.. ఇక, గతంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని.. స్థానిక సంస్థలు అందరికీ ఉపయోగకరంగా ఉండాలంటే సభ్యులకు బాధ్యతను గుర్తు చేయాలని సీఎం సూచించారని…..
3.తుఫాన్ల కంటే వేగంగా విశాఖను విజయసాయి రెడ్డి ధ్వంసం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. విశాఖలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఉత్తరా౦ధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్న.. రాష్ట్ర ప్రజలంతా ‘జే’ టాక్స్ కడుతుంటే… విశాఖ ప్రజలు ‘వీజే’ టాక్స్ కడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. తుఫాన్ల కంటే వేగంగా విశాఖను విజయసాయి రెడ్డి ధ్వంసం చేస్తున్నారన్న ….
4. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ సభా వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఇతర పార్టీల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి.. అధికార, ప్రతిపక్ష నేతలు ఇలా అంతా పవన్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక, ఇవాళ పవన్ వ్యాఖ్యలపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. పవన్ కళ్యాణ్ ఎటూకాకుండా తలతిక్కతనంగా మాట్లాడారని ఎద్దేవా చేశారు.. బీజేపీ, వైసీపీ భార్య భర్తలు పెళ్లి చేసుకోకుండా ఎలా కాపురం చేస్తారో ఆ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ ఆయన.. బీజేపీ, వైసీపీ, జనసేన కలిసి ఉన్నా మాకు అభ్యంతరం లేదు.
5.బెజవాడ కార్పోరేషన్ పనితీరుపై విపక్ష టీడీపీ నిరసన తెలుపుతోంది. విజయవాడ నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా కౌన్సిల్ హాల్ కి నిరసన తెలుపుతూ వెళ్లారు టీడీపీ కార్పొరేటర్లు. విజయవాడ నగర పాలక సంస్థ మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వైసీపీ పాలకపక్షంపై కార్పోరేటర్ కేశినేని శ్వేత మండిపడ్డారు.
6.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్.ఆర్.ఆర్ సినిమా మేనియా నడుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీ ఈనెల 25న విడుదల కానుంది. ఈ సినిమా టిక్కెట్ బుకింగ్స్ అప్పుడే ప్రారంభం కాగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు వ్యాపారులు ఆర్.ఆర్.ఆర్ మూవీ క్రేజ్‌ను వినియోగించుకుంటున్నారు.
7.మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. శనివారం నాడు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత మహిళలు ఓటమి పాలయ్యారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసింది. మిథాలీరాజ్ (68), యస్తికా భాటియా (59), హర్మన్ ప్రీత్‌కౌర్ (57 నాటౌట్), పూజా వస్త్రాకర్ (34) రాణించారు.
8.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ విశ్వవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మేనియా పట్టుకుంది. ఈ సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ ఆర్ఆర్ఆర్ ప్రచారం ఉద్ధృతమవుతోంది. ఇవాళ చిత్రబృందం బెంగళూరు చిక్కబళ్ళాపూర్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సన్నద్ధమవుతోంది. దీనిపై ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి ఓ వీడియో సందేశం వెలువరించారు. ఎగ్జయిట్ మెంట్ ఆపుకోలేకపోతున్నామని తెలిపారు. ఇవాళ రాత్రి బిగ్ ఈవెంట్ జరగనుందని, ఎన్నో సంవత్సరాల తర్వాత అందరినీ కలవబోతున్నామని తెలిపారు.
09.హైదరాబాద్ లో ఓ వైద్యుడు హోటల్లో మరణించడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు పంకజ్ కుమార్ జైన్ కుమార్తె అనుపమ జైన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని మంత్రుల నివాసం ఎదురుగా ఉన్న లాండ్ మార్క్ హోటల్ లో వైద్యుడి దుర్మరణం వివాదాస్పదం అవుతోంది.
10. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందిన విషయాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఆయనపై ఎంతటి అభిమానాన్ని పెంచుకున్నారో అర్ధమవుతుంది. ఇక ఇటీవలే పునీత్ చివరి చిత్రం జేమ్స్ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. పునీత్ అభిమానులే కాకుండా అందరూ ఆ సినిమాను ఆదరించి పునీత్ కి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఇక తాజాగా ఒక అభిమాని తన అభిమాన హీరోను చూస్తూనే కన్నుమూయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా గ్రామంలో జరిగింది.