2.దేశవ్యాప్తంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై పెద్ద చర్చ సాగుతోంది.. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన కాశ్మీరీ పండిట్ల బాధను చెప్పే ఈ చిత్రంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా లేకపోలేదు.. దాదాపు 12 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూలు చేసింది.. ఈ చిత్రంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రశంసలు కురిపించారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సినిమాపై మండిపడ్డారు.. ఇవాళ తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది.. ఈ భేటీలో తొలి సెషన్‌లో మాట్లాడిన కేసీఆర్.. కాశ్మీర్ ఫైల్స్ సినిమాను కూడా ప్రస్తావించారు..
3. విజయనగరంలో అధికారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా ? ధరల నియంత్రణతో మంచి పేరు తెచ్చుకున్న అధికారికి…అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయా? వ్యవహారానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వమే రంగంలోకి దిగింది.
4. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరింత స్ఫష్టత ఇచ్చారు. యాసంగి సీజన్ లోనూ కచ్చితంగా తెలంగాణ నుండి రా రైస్ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని పీయూష్ గోయల్ చెప్పారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.
5.19 ఏళ్ల వయసులో సాధారణంగా ఎవరైనా కాలేజీ చదువుతో లేదంటే ఖాళీ దొరికితే స్నేహితులతో కలసి షికార్లు కొడుతుంటారు. కానీ 19 ఏళ్ల కుర్రాడు ప్రదీప్ మెహ్రా అలా కాదు. చిన్న వయసుకే బాధ్యతలు తెలిసినవాడు. ఉత్తరాఖండ్‌లోని పల్మోరాకు చెందిన ఈ బాలుడు నోయిడాలోని సెక్టార్ 16లో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో పనిచేస్తుంటాడు. పొద్దున వెళితే.. అర్ధరాత్రి వరకు డ్యూటీ. దీంతో రాత్రి విధులు ముగిసిన తర్వాత 10 కిలోమీటర్ల దూరంలోని బరోలాలో ఉన్న తన ఇంటి వరకు పరిగెడుతూ వెళ్లడం అతడి దినచర్యలో భాగం. అతడితో పాటు అతడి సోదరుడు, అమ్మ కలసి ఉంటున్నారు. ప్రస్తుతం ప్రదీప్ అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
6.టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖా వాణి. నిత్యం తన కూతురు సుప్రీతతో కలిసి చిట్టిపొట్టి డ్రెస్ లతో వీడియోస్ చేస్తూ ఇంకా గుర్తింపు తెచ్చుకున్న సురేఖా ప్రస్తుతం పలు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మూడు రోజుల క్రిత్రం రోడ్డు ప్రమాదంలో యూట్యూబ్ స్టార్ గాయత్రి అలియాస్ డాలీ డ్రీకూజ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపట్ల సురేఖా సంతాపం వ్యక్తం చేస్తూ.. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది.
7.అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. లాస్ ఏంజెల్స్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు ఓ చిన్నారి స్వాగతం పలికింది. ఆ చిన్నారిని చూసి కేటీఆర్ సంబురపడ్డారు. ఆమె పేరు వినగానే మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ చిన్నారి పేరు ఏంటంటే.. కికో … కికో అనగా కరుణమూర్తి. ఆ అమ్మాయి పేరు విన్న కేటీఆర్ ఆమె తల్లిదండ్రులపై ప్రశంసలు కురిపించారు. ఆమె తల్లిదండ్రులు మంచి ఆలోచనాపరులంటూ చెప్పక తప్పదని ప్రశంసించారు. చిన్నారి తన పేరుకు తగ్గట్టుగానే తనతో ఫోటో దిగిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
8.ఇటీవల టాలీవుడ్ లో జరిగిన మా ఎన్నికలు ఎంతటి వివాదం సృష్టించాయో అందరికి తెలిసిందే. అయితే అంతకు మించి తమిళనాట నడిగర్ సంఘం ఎన్నికలు వివాదాస్పదం అయ్యాయి. 2019లో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు జరిగాయి. అప్పట్లో విశాల్ వర్గం అవకతవకలకు పాల్పడిందంటూ ప్రత్యర్ధి వర్గానికి చెందిన భాగ్యరాజ్ తదితరులు కోర్టుకు వెళ్ళడంతో ఫలితాలను నిలిపి వేశాయి.
9.ఈ ఏడాది ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు అడుగుపెట్టబోతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ అందులో ఒకటి. పేపర్ మీద ఈ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. మరి ప్రధాన టోర్నీలో ఎలా రాణిస్తుందో అన్న విషయం అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. రూ.7,090 కోట్లతో సంజీవ్ గోయెంకా ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. రూ.17 కోట్లు ఖర్చు చేసి కేఎల్ రాహుల్‌ను మెగా వేలం కంటే ముందే తీసుకున్నారు. అంతేకాకుండా కెప్టెన్‌గానూ నియమించారు. మరోవైపు గతంలో కోల్‌కతాకు…
10.ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకొని అభిమానులను నిరాశపరిచిన విషయం విదితమే. దీంతో ప్రభాస్ అభిమానులందరూ ఆయన నెక్స్ట్ సినిమాలపై భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం డార్లింగ్ అభిమానులందరి చూపు ప్రాజెక్ట్ కె మీదనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. మహానటి చిత్రంతో అందరి మనసులను కంటతడి పెట్టించిన దర్శకుడు నాగ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.