తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం వర్సెస్ రాష్ట్రంగా వివాదం చెలరేగింది. తాజాగా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే సీఎం కేసీఆర్, మంత్రుల బృందం వత్తిడి వల్లే కేంద్రం దిగివచ్చిందా? రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించిందంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ డిమాండ్‌కు కేంద్రం దిగొచ్చింది. సీఎం కేసీఆర్ కృషి, మంత్రుల దౌత్యం ఫలించింది. వానా కాలం పంటకు సంబంధించి రాష్ట్రం నుంచి అదనంగా బియ్యం సేకరించేందుకు కేంద్రం అంగీకరించింది. రాష్ట్రం నుంచి మరో…
అధికారపార్టీలో చేరాక.. నిన్న మొన్నటి వరకు కామ్‌గా ఉన్న ఆ ఎమ్మెల్యే ఒక్కసారిగా గేర్ మార్చారా? మంత్రిపైనే పైచెయ్యి సాధించారా? కీలక పదవిని తన నియోజకవర్గానికి దక్కించుకుని చర్చల్లోకి వచ్చారా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా పదవి? ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల క్రాస్ ఓటింగ్ వేడి సెగలు రేపుతున్న సమయంలో.. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి నియామకం మరో కొత్త చర్చకు దారితీసింది. పార్టీ నేత కొత్తూరు ఉమా మహేశ్వరరావుకు…
కేసీఆర్ విధానాలతో ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మ ఘోషిస్తుందని బండి సంజయ్ అన్నారు. సోమవారం నిర్వహించిన ‘నిరుద్యోగ దీక్ష’ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ దీక్షను భగ్నం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను గృహ నిర్భందం చేశారు. బీజేపీ దీక్ష అంటేనే కేసీఆర్‌కు వణుకుపుట్టిందన్నారు. ఇన్ని రోజులు సీఎంకు కోవిడ్ గుర్తుకు రాలేదు. ఈరోజు దీక్షకు వేలాది తరలివస్తున్నారని తెలిశాక కోవిడ్ గుర్తుకొచ్చిందా అంటూ…
తెలంగాణలో యూట్యూబ్ ఛానెళ్ళు లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయాయి. వాటిపై నియంత్రణ కూడా వుండడం లేదు. దీంతో యూట్యూబ్ వార్తా చానెళ్లకు ముకుతాడు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగిస్తోంది. యూట్యూబ్ చానెళ్లు చేస్తున్న అభ్యంతరకర ప్రసారాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అసత్య, విద్వేషపూరిత వార్తలు ప్రసారాలు చేయడం, మతాలు, కులాల మనోభావాలను దెబ్బతీయడం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం వుంది. రాజకీయంగా కొందరిని టార్గెట్ చేసుకుని కామెంట్లు, పోల్స్ పెట్టి వ్యక్తిగత, కుటుంబ…
1. కృష్ణా జిల్లా గుడివాడలో ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, టీడీపీ నేత వంగవీటి రాధాలు ఒకేచోట కలుసుకున్నారు. గుడివాడలోని కొండాలమ్మ గుడి వీరి కలయికకు కారణమైంది. ఈ ముగ్గురూ కృష్ణా జిల్లాలో పేరున్న పొలిటికల్ లీడర్స్ కావడం విశేషం. 2. రైతు చట్టాలను మళ్లీ తీసుకు వస్తామని కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలపై…
1.దేశంలో రోజు రోజుకు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. భారత్‌లో ఇప్పటికే 245 కేసులకుపైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పదిహేడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే వీటి తీవ్రత మాత్రం పది రాష్ట్రాల్లోనే ఉండటంతో రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో ఈ బృందాలు పర్యటించి కేసులను అధ్యయనం చేస్తారు. 2. ఏపీ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ సీఎం…
1. తెలంగాణ రైతుల హక్కులను టీఆర్ ఎస్ ప్రభుత్వం బీజేపీకి తాకట్టు పెట్టిందని.. రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఖరీఫ్ ధాన్యం కొనకుండా రైతు సమస్య నుండి తప్పించుకునే కుట్ర సీఎం కెసిఆర్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మూడు నెలల నుండి రైతులు హరిగోస పడుతున్నారని… కళ్ళాల దగ్గర వడ్లు, ఇంటి దగ్గర రైతుల శవాలు అన్నట్టుంది పరిస్థితి ఉందని ఫైర్ అయ్యారు. రైతుల హక్కులను బీజేపీకి తాకట్టు పెట్టింది :రేవంత్ రెడ్డి 2.నదిలో ప్రయాణిస్తున్న…
1 తెలంగాణలో మళ్ళీ ముందస్తు ఎన్నికలు రానున్నాయా? కేసీఆర్ గతంలోలాగే మళ్లీ ఎన్నికల నగారా మోగించనున్నారా? 2023లో రావాల్సిన ఎన్నికలు 2022లో ఎప్పుడైనా వస్తాయా? అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. సిద్ధంగా ఉండండి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు. రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అమిత్ షా నోట ముందస్తు ఎన్నికల మాట 2 ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.…
1 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర ప్రదేశ్‌పై ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాల ఖాతాలకు రూ.వెయ్యి కోట్లను ప్రధాని మోదీ బదిలీ చేశారు. 2 హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. రెండు రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ఈ ధాన్యం కొనుగోలు అంశాన్ని లేవనేత్తారని… అంతకు ముందు ఈ…
1 దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు ఇప్పటి వరకు దేశంలో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, ఒమిక్రాన్ వేరియంట్లో మరణాల రేటు తక్కువగానే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలోనే బ్రిటన్‌లో ఒమిక్రాన్ మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్నది. దీంతో ప్రపంచదేశాలన్నీ అప్రమత్తం అయ్యాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే దీనిపై రాష్ట్రాలను హెచ్చరించింది. ఒమిక్రాన్‌పై కేంద్రం కీలక వ్యాఖ్యలు 2 దశాబ్దాలుగా ఉన్న ఎన్నికల సవరణ చట్టాల బిల్లుకు కేంద్ర…