Ganja : గంజాయి స్మగ్లర్లు.. పోలీసులకు దొరకకుండా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. కార్లలో గంజాయి తరలిస్తూ..ముందు ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే తరహాలో ఏపీ నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. మొత్తంగా 250 కిలోల గంజాయి సీజ్ చేశారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్నారు. తమ అక్రమ దందాకు బ్రేకులు లేవనే విధంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా ఏపీలోని…
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీట్ విచారణ పేరుతో తమను వేధిస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. తరచూ పోలీస్ స్టేషన్ కు పిలిచి వేధిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు ప్రభాకర్ రావుకు ఇచ్చిన రిలీఫ్‌ను కొట్టివేయాలని పోలీసులు కోరారు. ప్రభాకర్ రావు పిటిషన్ ఆగస్టు 4వ తేదీన విచారణకు రానుంది.
Kidnap : హనుమకొండలో మైనర్ బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం ఓ మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని హనుమకొండ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిందితుల చెరలో ఉన్న బాలుడిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుల్లో ప్రధాన అనుమానితురాలు పూరి పద్మ గతంలో బ్రాహ్మణవాడలోని క్యాటరింగ్ మాస్టర్…