Hyderabad: హైదరాబాద్ పోలీస్ శాఖకు మచ్చతెచ్చే విధంగా అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ భాను ప్రకాశ్ ప్రవర్తించిన తీరు పెద్ద వివాదంగా మారింది. బెట్టింగ్‌లలో బాగా మునిగిపోయి అప్పుల పాలైన భాను ప్రకాశ్, ఆర్థిక ఇబ్బందులు తీర్చుకునేందుకు చట్టవిరుద్ధ మార్గాలు ఎంచుకున్నట్టు బయటపడింది. ఓ రికవరీ కేసులో స్వాధీనం చేసిన ఐదు తులాల బంగారాన్ని తన సొంత ప్రయోజనాలకు వాడుకుని పోలీస్ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీశాడు. బాధ్యతగా పని చేయాల్సిన స్థానంలో ఉండి నేరాలకు పాల్పడటంతో…
Adilabad: యువతలో సోషల్ మీడియా రీల్స్ పిచ్చి పెరిగిపోతుంది. వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదకర స్టంట్స్ చేస్తుంటే.. మరికొన్ని సార్లు చట్ట విరుద్ధ పనులు చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో కొందరు యువకులు ఏకంగా పోలీస్ వాహనాలతోనే రీల్స్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. పోలీసు పెట్రోలింగ్ వాహనంతో.. రీల్స్ చేయడం ఏంటి? అని నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.
CM Revanth Reddy: పోలీస్ అంటే నమ్మకం.. విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోవడానికి సైతం మన పోలీసులు వెనుకంజ వేయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ లోని పోలీస్ మార్టియర్స్ మెమోరియల్‌లో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. విధి నిర్వహణలో వీరు మరణం పొందిన అమరవీరులకు నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలు తరుపున ముఖ్యమంత్రిగా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాట్టు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 194 మంది…
Nizamabad: నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తెల్లవారు జామున రియాజ్ బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. గత 17న వాహనాల దొంగతనం కేసులో రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలిస్తుండగా, కానిస్టేబుల్ ప్రమోద్‌పై కత్తితో దాడి చేసి పరారైన విషయం తెలిసిందే. 48 గంటల్లోనే సారంగాపూర్ వద్ద పోలీసులు రియాజ్‌ను పట్టుకున్నారు. అయితే, అరెస్ట్ సమయంలో…
Hyderabad Fake Honey: తేనె తింటున్నారా అయితే జాగ్రత్త. నగరంలో కల్తీ తేనె తయారు చేస్తూ విక్రయిస్తున్న కేటుగాళ్లు ఎంతోమంది తయారయ్యారు. వాళ్ళనుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నగర పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తరహా తేనే తయారీ చేస్తూ పట్టుబడ్డారు కేటుగాళ్లు. దీనిలో బెల్లం కలిపి తయారు చేసి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబా నగర్ బ్లాక్ వద్ద వంద…
Nalgonda Crime: నల్లగొండలో ఇద్దరు కామరూప రాక్షసులను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఇద్దరిపై పోక్సో సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో ఉన్న కీలక నిందితుడు గడ్డం కృష్ణ.. మైనర్ బాలికకు చెందిన గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. నల్లగొండలో సెప్టెంబర్ 7న ఓ మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. 2 రోజుల్లోనే కేసు ఛేదించారు. మైనర్ బాలిక…
DGP Jitender: పోలీస్ సర్వీస్‌లో 33 సంవత్సరాల ఉన్నతమైన సేవల తర్వాత రాష్ట్ర DGP జితేంద్ర సూపర్ యానిమేషన్ పై అధికార పదవీ విరమణ చేశారు. వీడ్కోలు కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ సీనియర్ అధికారులు, మాజీ అధికారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మీడియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా DGP జితేంద్ర మాట్లాడుతూ.. “వీడ్కోలు అత్యంత ఉన్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసారు. మార్చింగ్, బ్యాండ్ ప్రదర్శనలు, గుర్రాల బృందం ప్రదర్శన అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమం ఘనంగా జరిగేందుకు…
Ganja : గంజాయి స్మగ్లర్లు.. పోలీసులకు దొరకకుండా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. కార్లలో గంజాయి తరలిస్తూ..ముందు ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే తరహాలో ఏపీ నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. మొత్తంగా 250 కిలోల గంజాయి సీజ్ చేశారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్నారు. తమ అక్రమ దందాకు బ్రేకులు లేవనే విధంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా ఏపీలోని…