Nalgonda Crime: నల్లగొండలో ఇద్దరు కామరూప రాక్షసులను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఇద్దరిపై పోక్సో సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో ఉన్న కీలక నిందితుడు గడ్డం కృష్ణ.. మైనర్ బాలికకు చెందిన గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. నల్లగొండలో సెప్టెంబర్ 7న ఓ మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. 2 రోజుల్లోనే కేసు ఛేదించారు. మైనర్ బాలిక మృతికి కారణమైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుంచి ఒక ఆటో, ఒక పల్సర్ బైక్, 2 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
Gonda Girl Record: 8 నిమిషాల్లో 240 పుషప్స్, గంటలో 10 కిలోమీటర్లు.. రికార్డ్స్‌లోకి ఆరేళ్ల చిన్నారి!
మైనర్ బాలిక హత్య కేసులో కీలక నిందితుడు గడ్డం కృష్ణను.. మైనర్ బాలిక గ్రామానికే చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మరొక నిందితుడు కృష్ణ స్నేహితుడు మధుగా నిర్ధారించారు. సెప్టెంబర్ 7న అన్నారెడ్డిగూడెం నుంచి మైనర్ బాలిక నల్లగొండలోని ఓ ప్రయివేట్ ఇంటర్ కాలేజీకి బయల్దేరింది. కానీ ఆమెను మధ్యలోనే అటకాయించిన గడ్డం కృష్ణ.. తనకు ఉన్న పాత పరిచయంతో మాయ మాటలు చెప్పాడు. మైనర్ బాలికను ఆటోలో ఎక్కించుకుని నేరుగా స్నేహితుడి రూమ్‌కు తీసుకు వెళ్లాడు. ఆ తర్వాత తన స్నేహితుడు మధును కూడా రమ్మని పిలిచాడు. నిందితులిద్దరూ కలిసి ఆ అమ్మాయిపై అత్యాచారం చేశారు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయింది. అమ్మాయి చనిపోవడంతో భయాందోళనకు గురైన నిందితులు డెడ్ బాడీని అక్కడే వదిలేసి పారిపోయారు.
Moringa Leaves Powder Benefits: సర్వ రోగ నివారిణిగా మునగాకు
మరోవైపు కాలేజీకి వెళ్లిన అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదేని తల్లిదండ్రులు తల్లడిల్లారు. తమకు తెలిసిన చోటల్లా వెతికారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలించారు. అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజీలు, పలు సాంకేతిక క్లూల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. బాలిక డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం చేయించి తల్లిదండ్రులకు అప్పగించారు. అలాగే నిందితులను గుర్తించి.. వారి కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. చివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.