Adilabad: యువతలో సోషల్ మీడియా రీల్స్ పిచ్చి పెరిగిపోతుంది. వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదకర స్టంట్స్ చేస్తుంటే.. మరికొన్ని సార్లు చట్ట విరుద్ధ పనులు చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో కొందరు యువకులు ఏకంగా పోలీస్ వాహనాలతోనే రీల్స్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. పోలీసు పెట్రోలింగ్ వాహనంతో.. రీల్స్ చేయడం ఏంటి? అని నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.
READ MORE: Indiramma Saree: నేటి నుంచే ఇందిరమ్మ “కోటి” చీరల పంపిణీ.. చివరి తేదీ ఇదే..
ఈ ఘటన ఆదిలాబాద్ లో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ పోలీస్ శాఖకు చెందిన ఇన్నోవా వాహనంలో రీల్స్ చేసి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు యువకులు.. అధికారిక వాహనంలో రీల్స్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అదిరిపోయే లెవల్‌లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వాహనం ఎవ్వరు ఇచ్చారు..? రీల్స్‌కు అనుమతి ఎవరిచ్చారని పోలీస్ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇద్దరు యువకుల రీల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
READ MORE: Trump-Epstein: ఎప్‌స్టీన్ ఫైళ్ల విడుదల బిల్లుకు చట్టసభ ఆమోదం.. ట్రంప్ ఏం చేయబోతున్నారో..!\
ఈ ఏడాది ఏప్రిలోనూ ఇద్దరు యువకులు పోలీసు వాహనం నడుపుతూ.. దాంతో రీల్స్‌చేసి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగర్‌కర్నూల్ జిల్లా ఈగలపెంట మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈగలపెంట పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇన్నోవా వాహనాన్ని ఏప్రిల్ 8 ఇద్దరు యువకులు తీసుకెళ్లి రీల్స్ చేశారు. దోమలపెంట సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఓ హోటల్ వద్ద రీల్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఏకంగా పోలీస్ వాహనం ఎత్తుకెళ్లి రీల్స్ చేయటని నెటిజన్లు ప్రశ్నించారు.