CM Revanth Reddy: పోలీస్ అంటే నమ్మకం.. విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోవడానికి సైతం మన పోలీసులు వెనుకంజ వేయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ లోని పోలీస్ మార్టియర్స్ మెమోరియల్‌లో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. విధి నిర్వహణలో వీరు మరణం పొందిన అమరవీరులకు నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలు తరుపున ముఖ్యమంత్రిగా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాట్టు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 194 మంది తెలంగాణాలో ఆరుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కోటీ రూపాయల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం ఇస్తామమని ప్రకటించారు. బలిమెలలో జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 33 మంది కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. గాజులరామారంలో 200 గజాల స్థలాన్ని ఇస్తున్నామని ప్రకటించించారు. ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ దేశంలోనే తెలంగాణ పోలీసులు అగ్రస్థానంలో ఉన్నారని.. నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరగనీయకుండా చూశారని తెలిపారు. నేరం చేస్తే తప్పించుకోలేరు అన్న నమకాన్ని, ప్రజలు విశ్వాసాన్ని చూరగొన్నారని చెప్పారు. డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారు ఉన్న సహించి వద్దని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.
READ MORE: Gold Rates: వామ్మో మళ్లీ షాకిచ్చిన పసిడి ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
“కొత్త తరహా నేరాలు సవాలుగా మారుతున్నాయి. టెక్నాలజీ తోనే సైబర్ క్రైమ్ నేరగాళ్లకు సమాధానం చెబుతున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశాం.
సైబర్ నేరగాళ్ళను, అంతర్ రాష్ట్ర ముఠాలను అణిచివేసే చేయుచున్నారు. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అగ్రనాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతున్నాం. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పిలుపునిస్తున్న. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీ వంతుగా తోడ్పాటు అందించాలని పిలుపునిస్తున్నాను. మూడు కమిషనరేట్ పరిధిలో ఏడుగురు మహిళా అధికారులు ఉన్నారు. వీరిని చూసి రాష్ట్రం గర్విస్తోంది. ప్రతిక్షణం పోలీసులకు సవాలే, విరామం లేకుండా పనిచేస్తూ తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు. 16 వేల మంది కానిస్టేబుల్, ఎస్ ఐ లను నియమించాం. రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గకుండా విధి నిర్వాహణ చేసుకునేలా పరిస్థితులు తెచ్చారు. సామర్థ్యాన్ని బట్టి పోస్టింగ్‌లు ఇస్తున్నాం. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ ఐలకు కోటి రూపాయలు, ఎస్‌ఐ నుంచి సీఐల వరకు రూ. కోటి 25 లక్షలు, డీఎస్పీ నుంచి ఎస్పీ వరకు రూ.కోటిన్నర, ఆ పై స్థాయి అధికారులకు రెండు కోట్లు రూపాయలకు ఎక్స్‌గ్రేషియా పెంచుతున్నాం.” అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.