Telangana Olympic Association: తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికల బరిలో మాజీ ఎంపీ, ప్రభుత్వ క్రీడాశాఖ సలహాదారుడు జితేందర్ రెడ్డి బరిలో నిలబడి విజయం సాధించారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడి స్థానానికి జితేందర్ రెడ్డితో పాటు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు, చాముండేశ్వర్‌నాథ్ ఉపాధ్యక్ష స్థానానికి కూడా నామినేషన్ వేశారు. అలాగే ప్రధాన కార్యదర్శికి మల్లారెడ్డి, బాబురావు, ప్రదీప్ కుమార్ నామినేషన్లు వేశారు. Also Read: Deputy…
రేపు హైదరాబాద్‌లో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 4.30 నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్ పోటీ పడుతున్నారు.