Newlywed Woman Suicide in Vikarabad: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధి కోస్గి మండలం పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నవ వధువు కాళ్ల పారాణి ఆరకముందే కాటికి చేరింది. చంద్రవంచ గ్రామానికి చెందిన నవవధువు గొల్ల శ్రీలత(21) పెళ్ళైన మూడు రోజులకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.. ఈనెల 26న ఫరూక్ నగర్ మండలం భీమవరం గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది.. ఈనెల 27న దోమ మండలం మోత్కూరు గ్రామంలోని వధువు మామ ఇంటికి నవ వధువు, వరుడు వచ్చారు.. 28న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది..
READ MORE: Justice Surya Kant: కోటీశ్వరులు..? కొత్త సీజేఐ సూర్య కాంత్ ఆస్తి ఎంతో తెలుసా..?
గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది శ్రీలత.. చంద్రవంచ గ్రామానికి చెందిన ఓ యువకుడి వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.. న్యాయం చేయాలంటూ శివాజీ కూడలిలో మహబూబ్ నగర్- తాండూర్ ప్రధాన రహదారిపై మృతదేహంతో రాస్తారోకోకు దిగారు. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.