Cable Bridge: కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిపై బట్టలు ఆరబెట్టిన ఘటన చోటు చేసుకుంది. గతకొన్ని రోజులుగా కేబుల్ బ్రిడ్జ్ నిర్వహణ లేక వాహనదారులకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వందల కోట్ల రూపాయలతో కట్టిన కేబుల్ బ్రిడ్జి కనీసం మూడేళ్లు గడవకముందే ఇలాంటి దుస్థితికి చేరుకుంది. ప్రస్తుతం బ్రిడ్జిపై బట్టలు ఆరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్ని కోట్లు పెట్టి కేబుల్ బ్రిడ్జ్ కట్టింది బట్టలు అరేసుకోడానికా అంటూ నెటిజన్ల ఫైర్ అవుతున్నారు.
ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం రాష్ట్రపతి భవన్లో 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ, బీజేపీ మిత్ర పక్ష ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలంతా హాజరయ్యారు. అలాగే మాజీ ఉప రాష్ట్రపతులు వెంకయ్యనాయుడు, జగదీప్ ధన్కర్ దంపతులు, తదితరలంతా హాజరయ్యారు. సెప్టెంబర్ 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు…
షాకింగ్ మర్డర్స్.. భార్య, ప్రియుడి తలలు నరికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త! తమిళనాడు రాష్ట్రంలో సంచలన సంఘఠన చోటు చేసుకుంది. కళ్లకురిచ్చి జిల్లా మలైకొట్టాళం గ్రామానికి చెందిన కొళంజి అనే వ్యక్తి తన భార్య గీతాతో కలిసి నివాసముంటున్నాడు. అయితే, ఈ మధ్య భార్య గీతాకు అదే గ్రామానికి చెందిన తంగరసు అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం కొళంజి తన ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా భార్య గీతా, ప్రియుడు తంగరసును…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపులు భయాందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో లెంకలగడ్డ గోదావరి సమీపంలో పిడుగు పడి వందకు పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
నేడు ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం. ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం. కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్, ఎన్డీఏ భాగస్వామ్యపక్ష నేతలు. విశాఖ: ఏపీ లిక్కర్ కేసులో సుదీర్ఘంగా కొనసాగిన సిట్ తనిఖీలు.. నరెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో ముగిసిన సోదాలు. నిన్న ఉదయం 11 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు కొనసాగిన సిట్ విచారణ.. హార్బర్ పార్క్ ఏరియాలోని వెర్టిలైన్, గ్రీన్ ఫ్యూయల్ సంస్థల కార్యాలయాల నుంచి హార్డ్…
“ది లక్” – సామాన్యుల కోసం తొలి రియాలిటీ గేమ్ షో! దేశంలో రియాలిటీ షోల పట్ల ప్రజల్లో క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు వచ్చిన షోలు ఎక్కువగా సెలబ్రిటీలు, సినీ తారలు లేదా ప్రముఖులను ఆధారంగా చేసుకుని సాగాయి. కానీ ఇప్పుడు పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో ఒక వినూత్నమైన రియాలిటీ గేమ్ షో రాబోతుంది. అదే “ది లక్”. ఇది సామాన్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తొలి అతిపెద్ద రియాలిటీ షో. ఈ…
Telangana Lightning Tragedy: పిడుగు పాటుకు ఆరుగురు మృతి చెందిన దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బుధవారం నిర్మల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల పరిధిలో ఆరుగురు పిడుగు పాటుకు బలయ్యారు. నిల్మల్ జిల్లా పెంబి మండలంలో గుమ్మనుయోంగ్లాపూర్‌లో ముగ్గురు మృతి చెందారు.